S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 03:11

ఆళ్లగడ్డ, ఆగస్టు 2: నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామ పొలిమేరల్లో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయానే్న అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా వస్త్రాలతో, పూలమాలలతో, నిమ్మకాయలతో అలంకరించి ప్రతేక పూజలు చేశారు. కుంకుమార్చన చేశారు. ఉదయానే్న అమ్మవారికి కేక్‌ను కట్ చేశారు.

08/03/2016 - 03:10

మంత్రాలయం, ఆగస్టు 2: మంత్రాలయంలో ఈ నెల 17 నుండి శ్రీ రాఘవేంద్రస్వామి 345 ఆరాధనోత్సవాల సందర్భంగా మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు మంగళవారం సాయంత్రం ప్రధాన వీధులను, మఠం నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే రాఘవేంద్ర కూడలిలో ఉన్న ఆర్చి మరమ్మతు పనులను, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరుగుతున్న రోడ్డు, కాలువ పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

08/03/2016 - 03:08

ఖమ్మం, ఆగస్టు 2: జిల్లాలో భూ ఎంజాయ్‌మెంట్ సర్వే కోసం 2,119దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 832దరఖాస్తులను ఆమోదించి 528 ఆన్‌లైన్ చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ దివ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంజాయ్‌మెంట్ సర్వేపై సర్వేయర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ భూ ఎంజాయ్‌మెంట్ సర్వే చేసేందుకు మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

08/03/2016 - 03:07

కొత్తగూడెం, ఆగస్టు 2: ప్రజాఉద్యమాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉక్కుపాదం మోపుతున్నారని, పోడు-కూడు కోసం ఎన్ని నిర్బంధాలనైనా ఎదుర్కొంటామని సిపిఎం రాష్టన్రేత కాసాని ఐలయ్య అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో పోడు సాగుదారులను అక్రమంగా అరెస్ట్‌లు చేస్తూ నిర్బంధాలకు గురి చేస్తున్నారని నిరసిస్తూ మంగళవారం భారీ ప్రదర్శనను నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

08/03/2016 - 03:07

భద్రాచలం, ఆగస్టు 2: దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీరామదివ్యక్షేత్రంలో అంత్యపుష్కరాల సంబురాలు అంబరాన్ని అంటాయి. పోటెత్తిన భక్తులతో గోదావరి తీరం పరవశించింది. పుష్కరుడు సైతం పులకించాడు. పుష్యమి నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి మహాపట్ట్భాషేకం, మంగళవారం వేళ ఆంజనేయస్వామికి అభిషేకం, పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆండాళ్లమ్మ తిరునక్షత్రోత్సవాలతో రామాలయం కిటకిటలాడింది.

08/03/2016 - 03:06

పాల్వంచ, ఆగస్టు 2: తుఫాన్ కారణంగా చీరు వర్షాలకు పాల్వంచ మండల పరిధిలోని కినె్నరసాని రిజర్వాయర్ నీటితో కళకళలాడుతూ కనిపిస్తుంది. దీంతో పర్యాటకులు కినె్నరసాని రిజర్వాయర్‌ను, జింకలపార్కు, కాటేజీలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కినె్నరసాని పర్యాటకులతో కిటకిటలాడుతూ కనిపించింది.

08/03/2016 - 03:05

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 2: జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) నిర్వాహణకు మార్కెట్ కార్యాలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పాలకుర్తిప్రసాదరావు వెల్లడించారు.

08/03/2016 - 03:05

ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 2: పోడు సాగుదారుల సమస్యలను శాస్ర్తియంగా పరిష్కరించాలని, పోడు సమస్యలపై తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టినట్లు సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి పోటు రంగారావు వెల్లడించారు.

08/03/2016 - 03:04

ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 2: ఖమ్మంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ పాపాలాల్ తెలిపారు.

08/03/2016 - 03:04

నేలకొండపల్లి, ఆగస్టు 2: కార్మికుల హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాలని సిఐటియు పాలేరు కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం నేలకొండపల్లి గ్రామంలో సిఐటియు మండల మహాసభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌రావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం బిల్డింగ్ కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాడాలన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు దక్కుతాయన్నారు.

Pages