S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 02:34

పలమనేరు, ఆగస్టు 2: పలమనేరు సమీపంలోని నాగమంగళం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిత్తూరు నుండి బెంగళూరు వైపు వెళ్తున్న టాటా సఫారి వాహనంలో ఉన్న 270కిలోల ఎర్రచందనాన్ని, టాటా సఫారిని సీజ్ చేసినట్లు పలమనేరు సిఐ సురేంద్రరెడ్డి తెలిపారు. టాటా సఫారిలో ఉన్న ఎర్రచందనం దొంగలు పరారైయ్యారు.

08/03/2016 - 02:33

తిరుపతి, ఆగస్టు 2 : ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బర్డ్ ఆవరణలో 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణం పూర్తయి రోగులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నట్లు టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ సాంబశివరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం బర్డ్ ఆసుపత్రిలో బర్డ్ ట్రస్టు సమావేశం జరిగింది.

08/03/2016 - 02:33

కెవిబిపురం, ఆగస్టు 2 : వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బంద్ కెవిబిపురంలో విజయవంతమైంది. ఆ పార్టీ మండల కన్వీనర్ గవర్లకృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బంద్ విజయవంతమైంది.

08/03/2016 - 02:32

రొంపిచెర్ల, ఆగస్టు 2: మండలంలోని పెద్దమల్లెల గ్రామంలో బెస్తపల్లె సమీపంలో వెలసిన ఈశ్వరాలయంలో పురాతనమైన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళారు. గ్రామస్థులు సోమవారం ఆలయానికి వెళ్ళి చూడగా విగ్రహం చోరీకి గురైనట్లు కనుగొన్నారు. ఈవిగ్రహం సుమారు 90 ఏళ్ళు కాలంనాటి పురాతన విగ్రహమని గ్రామస్థులు తెలిపారు.

08/03/2016 - 02:32

రేణిగుంట, ఆగస్టు 2 : మండలంలోని గుత్తివారిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో శ్రీరాముల వారి పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన సంఘటన మంగళవారం ఉదయం మండలంలో సంచలనం రేపింది. దేవాదాయ శాఖ కార్యదర్శి రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు, మండలంలోని గుత్తివారి పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయస్వామి గుడిలో సోమవారం అర్ధరాత్రి ఆలయం లోపల చొరబడిన దుండగులు నాలుగు గేట్ల తాళాలను పగులగొట్టారు.

08/03/2016 - 02:31

కుప్పం, ఆగస్టు 2:రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఈనెల 8,9వ తేదిల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈపర్యటనపై జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

08/03/2016 - 02:31

రేణిగుంట, ఆగస్టు 2 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని వైకాపా జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి నిప్పులు చెరిగారు. మంగళవారం ఉదయం వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని బంద్ శాంతియుతంగా కొనసాగుతుంటే తిరుపతిలో తమను అరెస్ట్‌చేసి రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

08/03/2016 - 02:31

తిరుపతి, ఆగస్టు 2 : పలు కారణాలతో రెండేళ్ల క్రితం సస్పెండ్‌కు గురైన డ్రైవర్ మునస్వామి తనను విధుల్లోకి తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతని ఒంటిపై నీళ్లుపోశారు. అప్పటికే తీవ్రగాయాల పాలైన మునస్వామిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు.

08/03/2016 - 02:28

రాయచోటి, ఆగస్టు 2: అందరిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది పలువురిలో అంకిత భావం లోపించి మొక్కుబడిగా విధులు హాజరు అవుతుండటంతో ఆసుపత్రులకే వివిధ రకాల జబ్బులు సోకి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు.

08/03/2016 - 02:28

కడప,ఆగస్టు 2: ఏపికి ప్రత్యేక హోదా, ప్యాకేజి నిమిత్తం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు మంళవారం చేపట్టిన బంద్ జిల్లాలో పాక్షికంగా ముగిసింది. వైకాపా నేతలు బంద్‌కు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికినా వామపక్షనేతలను సైతం అరెస్టు చేశారు. ఉదయం 10గంటల వరకు మూతపడ్డ వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు , 10గంటల తర్వాత యధావిధిగా తెరచుకున్నాయి.

Pages