S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 02:55

గుంటూరు, ఆగస్టు 2: శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం స్వచ్ఛ్భారత్ మిషన్‌లో మరోమారు జాతీయస్థాయి ఖ్యాతికెక్కింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛ్భారత్ మిషన్ గ్రామీణ్‌పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని బొల్లారానికి చెందిన ఓ ముస్లిం మహిళ తన కోడలికి బహుమతిగా టాయిలెట్‌ను నిర్మించి ఇచ్చారు.

08/03/2016 - 02:54

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 2: ఆగస్టు 2న విద్రోహ దినంగా పాటిస్తామని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు చెప్పడం వాటి దిగజారుడు తనానికి నిదర్శమని, రాష్ట్ర విభజన బిల్లును తప్పుల తడకగా తయారు చేసిన మీరు ద్రోహులంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు దుయ్యబట్టారు.

08/03/2016 - 02:54

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 2: రాష్ట్భ్రావృద్ధి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేకహోదా కేటాయించకుంటే మారోమారు నిరాహారదీక్ష చేసేందుకైనా వెనుకాడేది లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టంచేశారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రప్రజలు చేస్తున్న ఆందోళనను బట్టి నోరు తెరవాల్సి వచ్చిందన్నారు.

08/03/2016 - 02:54

మంగళగిరి, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వైఎస్‌ఆర్ సీపీ, వామపక్షాలు, నాన్‌పొలిటికల్ జెఎసి, వివిధ ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు తెల్లవారుఝాము నుంచి ఆర్‌టిసి బస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి, బస్సులను అడ్డగించారు.

08/03/2016 - 02:53

గుంటూరు (స్పోర్ట్స్), ఆగస్టు 2: జిల్లా టెన్నిస్ సంఘ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న టెన్నిస్ పోటీల్లో అండర్-14 బాలుర విభాగంలో విశాఖపట్నంకు చెందిన శశాంక్, బాలికల విభాగంలో ఎ జ్ఞానిత విజేతలుగా నిలిచారు. రన్నర్స్ టైటిల్‌ను బాలుర విభాగంలో చెన్నైకు చెందిన కృష్ణకుమార్, బాలికల్లో గుంటూరుకు చెందిన లేళ్ల అశ్రీత సాధించారు.

08/03/2016 - 02:53

చిలకలూరిపేట, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ సిపి చేపట్టిన బంద్ చిలకలూరిపేట పట్టణంలో ప్రశాంతంగా మంగళవారం ముగిసింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైసిపి జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

08/03/2016 - 02:52

అమరావతి, ఆగస్టు 2: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12 నుండి 23 వరకు స్థానిక పుష్కరఘాట్ల వద్ద 3 షిఫ్ట్‌లలో డే అండ్ నైట్ వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య తెలిపారు. మంగళవారం ఆమె జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి అమరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్నానఘాట్లు, ధ్యానబుద్ధ ప్రాజెక్టును పరిశీలించారు.

08/03/2016 - 02:51

కాకుమాను, ఆగస్టు 2: దేశం నాకేం ఇచ్చింది కాకుండా, దేశానికి నేనేమిచ్చాను అని అనుకున్నప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్న గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధుడు, వ్యవసాయ శాస్తవ్రేత్త, మువ్వనె్నల పతాక రూపకర్త పింగళి వెంకయ్య 140వ జయంతి కార్యక్రమం మంగళవారం మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. కొమ్మూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులు జాతీయ పతాకాలు చేతపట్టి ఆయన సేవలను కొనియాడారు.

08/03/2016 - 02:51

పొన్నూరు, ఆగస్టు 2: వైఎస్‌ఆర్ సిపి పిలుపుమేరకు ప్రత్యేకహోదా సాధనకు ఆ పార్టీ వర్గాలు, మిత్రపక్షాల మద్దతుతో మంగళవారం నిర్వహించిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్భంగా వైసిపి నేత రావి వెంకట రమణ నేతృత్వంలో మిత్రపక్షాలైన ఉభయ కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం వేకువజామునుండే బస్‌డిపోల ఎదుట బైఠాయించి బస్సులను కదలనీయకుండా నియంత్రించారు.

08/03/2016 - 02:49

అమలాపురం, ఆగస్టు 2: సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన వారికి అందించేందుకే ప్రజాసాధికార సర్వేను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

Pages