S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 03:18

గూడూరు, ఆగస్టు 2: గూడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రభుత్వ వసతిగృహాల పనితీరుపై ఆయా వార్డన్లతో మంగళవారం గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్‌కుమార్ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షించి కల్పించాలన్నారు.

08/03/2016 - 03:16

కర్నూలు, ఆగస్టు 2 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా, వామపక్ష పార్టీలు, జిల్లా బార్ అసోసియేషన్‌లు నిర్వహించిన ఆందోళనలతో జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది.

08/03/2016 - 03:16

పాములపాడు, ఆగస్టు 2:కృష్ణా పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని వారికి పటిష్ట భద్రత కల్పించాలని రాయలసీమ ఐజి శ్రీ్ధర్‌రావు పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఐజి సోమవారం సంగమేశ్వరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తొలుత ఐజి ఏఎస్పీ చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజతో కలిసి సంగమేశ్వరం చేరుకున్నారు.

08/03/2016 - 03:15

బనగానపల్లె, ఆగస్టు 2:మండల పరిధిలోని నందవరంలో మంగళవారం శ్రీ చౌడేశ్వరీమాత జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి విఎల్‌ఎన్ రామానుజన్, కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంకాలం వరకూ శాస్త్రోక్తంగా వివిధ కార్యక్రమాలు జరిపించారు. ఉదయం ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ గణపతిపూజతో అమ్మవారి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.

08/03/2016 - 03:14

నంద్యాల, ఆగస్టు 2 : జిల్లాలోని తంగెడంచ సీడ్ ఫారంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 300 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలకు చెందిన విత్తన ఉత్పత్తి పనులు ప్రారంభించామని, 2017 నాటికి పూర్త్తిస్థాయిలో 500 ఎకరాల్లో విత్తనోత్పత్తి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తంగెడంచ సీడ్ ఫారం స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు.

08/03/2016 - 03:13

కర్నూలు సిటీ, ఆగస్టు 2:సిఎం చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో నిత్యం విదేశాల్లో తిరుగుతూ సొంత వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారని పిఎసి చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్ పిలుపుమేరకు మంగళవారం నగరంలో బంద్ చేపట్టగా బుగ్గనను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి, అనంతరం విడుదల చేశారు.

08/03/2016 - 03:13

కర్నూలు సిటీ, ఆగస్టు 2:ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద అర్హులైన పేద ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సిహెచ్ విజయలక్ష్మి తెలిపారు. బిల్డర్ల సలహాలు, సూచనలు కోరుతూ మంగళవారం నగర పాలక సంస్థ సమావేశ భవన్‌లో సమావేశం నిర్వహించగా పట్టణ ప్రణాళిక రీజినల్ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి, కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.

08/03/2016 - 03:12

నందికొట్కూరు/మిడుతూరు, ఆగస్టు 2:రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేంత వరకూ ఉద్యమిస్తామని ఎమ్మెల్యే ఐజయ్య స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం మంగళవారం వైకాపా, వామపక్షాల ఆధ్వర్యంలో నందికొట్కూరు, మిడుతూరులలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో వైకాపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

08/03/2016 - 03:12

కర్నూలు అర్బన్, ఆగస్టు 2:రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రియో టార్చ్ రన్ నిర్వహించారు. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియం వద్ద నిర్వహించిన టార్చ్ రన్‌ను పారిశ్రామికవేత్త టిజి.్భరత్ జెండా ఊపి ప్రారంభించారు.

08/03/2016 - 03:11

మిడుతూరు, ఆగస్టు 2:మండల పరిధిలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఇటీవల ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పక్షుల సంచా రం కన్పించింది. ఈ కేంద్రంలో పరిధిలో గత ఆరేళ్లుగా బట్టమేక పక్షులు కన్పించడమే అరుదుగా మారింది. గతంలో 70 పక్షుల దాకా సంచరించే ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఒక పక్షి కన్పిస్తేనే సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది.

Pages