S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 02:28

కమలాపురం, ఆగస్టు 2: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బ్రిటీష్ పాలనను గుర్తు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హిట్లర్‌ను తలపించేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం వైసిపి బంద్ నిర్వహించగా సహించలేక పోలీసులతో తమ పార్టీ, అఖిలపక్ష నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలించడం దారుణమన్నారు.

08/03/2016 - 02:27

చక్రాయపేట, ఆగస్టు 2: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వామి శ్రావణ మాసోత్సవాలను పురష్కరించుకొని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి మంగళవారం గండి క్షేత్రంలో దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. దాతల సహకారంతో శాశ్వత షెడ్డు, క్యూలైన్లు పరిసర ప్రాంతాల్లోని ఆవరణాన్ని కూలీలతో గత రెండు రోజుల నుండి గండి క్షేత్రంలో బస చేస్తూ అభివృద్ధి చేయడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది.

08/03/2016 - 02:27

ఒంటిమిట్ట, ఆగస్టు 2:ఏకశిలా రామయ్య అభివృద్ధి పనులు రాజకీయ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామాలయాన్ని టిటిడిలో విలీనం చేశాక, నిధులు మాత్రం అధికంగా ఉన్నా, పనులు మాత్రం సరిగా లేవంటూ రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించడంతో కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా నిలిపేశాడు. దీంతో ఆలయ అభివృద్ధి కుంటుపడింది.

08/03/2016 - 02:26

రాజుపాళెం, ఆగస్టు 2:మండల పరిదిలోని గాదెగూడూరు గ్రామానికి చెందిన కాకనూరు చరణ్‌కుమార్‌రెడ్డి (13) అను విద్యార్థి కుందూనదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఆ విద్యార్థి కోసం కుందూనదిలో గాలింపుచర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. మంగళవారం దద్దనాల - కూలూరు గ్రామాల మధ్య కుందూనదిలో శవమై తేలాడు.

08/03/2016 - 02:26

కడప,(లీగల్)ఆగస్టు 2: జిల్లాకోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి బంద్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కోర్టులోని సివిల్, క్రిమినల్, బెంచ్‌కోర్టుల కేసుల విధులను న్యాయవాదులు బహిష్కరించి అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాకోసం చేస్తున్న బంద్‌కు మద్దతును ప్రకటించారు.
ఖాజీపేటలో...

08/03/2016 - 02:24

అనంతపురం, ఆగస్టు 2 : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం చేపట్టిన బంద్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వ్యాపార సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, హోటళ్లు, ఇతర ప్రైవేటు సంస్థలు మూతబడ్డాయి.

08/03/2016 - 02:23

అనంతపురం కల్చరల్, ఆగస్టు 2: యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 7న యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

08/03/2016 - 02:23

అనంతపురం, ఆగస్టు 2 : జిల్లా కేంద్రంలోని పిటిసి స్టేడియంలో నిర్వహించనున్న రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా కనుల పండువగా విజయవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సంబంధిత అధికారులకు సూచించారు.

08/03/2016 - 02:22

ధర్మవరం రూరల్, ఆగస్టు 2: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మవరం పర్యటన ఏర్పాట్లను డిఐజి ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు. హెలీప్యాడ్, పోతుకుంట వద్ద ఫారంపాండు ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే కళాశాల సర్కిల్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే ఫ్లై ఓవర్ ప్రారంభ స్థలాన్ని, పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో మొక్కలు నాటే పరిసరాలను పరిశీలించారు.

08/03/2016 - 02:22

బుక్కరాయసముద్రం, ఆగస్టు 2 : మండలంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని విప్ యామినీబాల అన్నారు. మంగళవారం బుక్కరాయసముద్రంలోని మార్కేండేయస్వామి ఆలయంలో నిర్వహించిన శింగనమల నియోజికవర్గ సమావేశంలో అమె మాట్లాడుతూ నార్పల, శింగనమల, పూట్లురు, యల్లనూరు, గార్లదినె్న, బుక్కరాయసముద్రం మండలాల కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

Pages