S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 02:14

విజయనగరం, ఆగస్టు 2: జాతీయ వారసత్వ సంపదను విద్యార్థులు కాపాడాలని కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. ఇంటాక్, మనఊరు-విజయనగరం సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వారసత్వ క్విజ్ పోటీలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ మాట్లాడుతూ జాతీయ వారసత్వ సంపదను కాపాడడం ద్వారా చరిత్రను కాపాడినట్లు అవుతుందన్నారు.

08/03/2016 - 02:13

విజయనగరం, ఆగస్టు 2: రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజస్ కమిటీ బుధవారం విజయనగరం పర్యటనకు వస్తుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఎమ్మెల్యే జి.సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ బుధవారం ఉదయం 11గంటలకు విజయనగరం చేరుకుంటుందని చెప్పారు.

08/03/2016 - 02:13

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని మంగళవారం జరిగిన బంద్‌లో భాగంగా వామపక్షాల పార్టీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డగించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. బంద్ కారణంగా ఉదయం నాలుగు నుంచి పది గంటల వరకు డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి.

08/03/2016 - 02:13

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 2: ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టిక్కెట్‌ఛార్జీలో 25 శాతం రాయితీని యాజమాన్యం కల్పించిందని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఆధార్ కార్డు గుర్తింపుపై టిక్కెట్‌ఛార్జీలో రాయితీ ఇచ్చామన్నారు.

08/03/2016 - 02:12

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 2: శారీరక ధృడత్వానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ద్రోహదపడతాయని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. పట్టణంలో రాజీవ్ క్రీడామైదానంలో మంగళవారం కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పూర్వకాలంలో కబడ్డీకి ఎంతో ప్రాచుర్యం ఉండేదని, ఎక్కువమంది యువకులు కబడ్డీపైనే ఆసక్తి చూపేవారన్నారు.

08/03/2016 - 02:10

కొవ్వూరు, ఆగస్టు 2: పవిత్ర పుణ్యక్షేత్రమైన కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అంత్య పుష్కరాలు మంగళవారం మూడో రోజు భక్తుల తాకిడి పెరిగింది. అమావాస్య అయినప్పటికీ తెల్లవారు ఝాము నుండి భక్తులు గోష్పాద క్షేత్రానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. గోష్పాద క్షేత్రాల్లోని స్నాన ఘట్టాలు భక్తులతో నిండిపోయాయి. కొవ్వూరు పరిసర ప్రాంతాల నుండి విశాఖపట్నం, ఇతర జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

08/03/2016 - 02:10

ఏలూరు, ఆగస్టు 2 : ఎన్నికల ముందు బిజెపి ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల అభీష్టాల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చేందుకు తగిన కృషి చేస్తామని, ప్రజలు అధైర్యపడాల్సిన పని లేదని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

08/03/2016 - 02:09

ఏలూరు, ఆగస్టు 2 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపిలు ప్రజలను మోసగిస్తున్నాయంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బంద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగాను, సంపూర్ణంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అలాగే విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో అవి తెరచుకోలేదు.

08/03/2016 - 02:09

వీరవాసరం, ఆగస్టు 2: ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో, పోలీసు రాజ్యం నడుస్తుందో తెలియడంలేదని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేకహోదా కావాలంటూ అఖిలపక్షం ఇచ్చిన రాష్టవ్య్రాప్త బంద్ పిలుపులో భాగంగా మంగళవారం వీరవాసరంలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

08/03/2016 - 02:08

భీమవరం, ఆగస్టు 2: ప్రత్యేక హోదా అంశం జిల్లాలో భారతీయ జనతా పార్టీ నేతలకు తలనొప్పిగా పరిణమించింది. ప్రత్యేకహోదా విషయంలో కొందరు అయోమయంలో ఉండగా మరికొందరు మాత్రం పార్టీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. జిల్లాలో బిజెపి భీమవరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. జిల్లాలో గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానాన్ని, అదే పరిధిలోని తాడేపల్లిగూడెం శాసనసభ స్థానాన్ని బిజెపి గెల్చుకుంది.

Pages