S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 02:07

ద్వారకాతిరుమల, ఆగస్టు 2: అమావాస్య తిథితోపాటు బంద్ ప్రభావం చిన వెంకన్న క్షేత్రంపై చూపింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. కేవలం స్వల్ప సంఖ్యలోనే భక్తులు శ్రీవారిని దర్శించారు. దీంతో ఆలయ పరిసరాలు, ప్రసాదాల టికెట్ కౌంటర్లు, కేశ ఖండన శాల విభాగాలు దాదాపు నిర్మానుష్యమయ్యాయి. శ్రావణ మాసం కావడంతో బుధవారం నుండి రద్దీ పెరగవచ్చునని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

08/03/2016 - 02:07

భీమవరం, ఆగస్టు 2: భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమే చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ చెప్పారు. హోదా పేరుతో రాజకీయ పార్టీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. మంగళవారం ఆయన భీమవరంలో విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందన్నారు.

08/03/2016 - 02:06

ఏలూరు, ఆగస్టు 2 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిన నేపధ్యంలో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కూడా పార్టీకి ప్రజలు బ్రహ్మరధం పట్టారని, ఇప్పటి వరకు ప్రభుత్వంచేసిన పనులు ప్రజల్లో స్పందన ఎలా వుంది, ఇంకేమీ చేస్తే బాగుంటుందనే విషయంపై నియోజకవర్గాల వారీగా మంగళవారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సమీక్షా సమావేశాలను నిర్వహించారు.

08/03/2016 - 02:06

ఏలూరు, ఆగస్టు 2 : తమ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తమను గుర్తించడంలేదని ఆచంట నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు మంగళవారం టిడిపి జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. తాము 1983 నుంచి పార్టీలోనే కొనసాగుతున్నామని, 2014 శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పితానికి టిక్కెట్ ప్రకటిస్తే తాము నిరాకరించామన్నారు.

08/03/2016 - 02:05

బుట్టాయగూడెం, అగస్టు 2: ఏజన్సీ తాటి టెంకలపై డెల్టా, మెట్టప్రాంత తేగల వ్యాపారుల కన్నుపడింది. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పొలాలు, గరువు భూములను చేపల చెరువులు, కోళ్ల ఫారాలు, పరిశ్రమలుగా చేయడంతో ఉన్న కొద్దిపాటి భూముల్లో గట్లమీద తాటితోపులు పెంచకపోవడంతో అక్కడి తేగల రైతులకు తాటి టెంకలు దొరకడం గగనమైపోతోంది. దీంతో వారు తాటి టెంకల కోసం పశ్చిమ ఏజన్సీపై పడ్డారు.

08/03/2016 - 02:05

వీరవాసరం, ఆగస్టు 2: ప్రత్యేక హోదా కోసం వీరవాసరం మండలంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వీరవాసరం, నౌడూరు, రాయకుదురు గ్రామాల్లో వైసిపి నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కోటిపల్లి బాబు, మద్దాల అప్పారావు, గుండా చిన్నా, నూకల కనకరావు, గూడూరి ఓంకారం, షాలినిబాబు, మద్దాల సత్యనారాయణమూర్తి తదితరుల నాయకత్వంలో 200 మంది భారీ మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు.

08/03/2016 - 02:04

పోలవరం, ఆగస్టు 2: పట్టిసం ఎత్తిపోతల పథకంలోని మోటార్లు రెండవ రోజు కూడా ఆన్ చేయలేదు. కృష్ణా జిల్లాలోని రాచూరు వద్ద ప్రాజెక్టు కుడి కాలువ అక్విడెక్టు దిగువ భాగంలో గండి పడడంతో గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. గండిపడక ముందు 12 మోటార్లు ద్వారా 4,250 క్యూసెక్కుల నీటిని కృష్ణాకు తరలించేవారు.

08/03/2016 - 02:04

ఏలూరు, ఆగస్టు 2 : జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మంగళవారం ఏలూరు నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. దాదాపు 50 ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను స్వయంగా అధ్యయనంచేశారు.

08/03/2016 - 02:03

నరసాపురం, ఆగస్టు 2: గోదావరి అంత్య పుష్కరాలు మూడవ రోజు మంగళవారం వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పిండ ప్రదానాలకు అమావాస్య మంచిదని భావించిన భక్తులు ఎక్కువగా పిండ ప్రదానాలు చేశారు. పట్టణంలో ఎన్టీఆర్ పుష్కరఘాట్, కొండాలమ్మ, అమరేశ్వర స్వామివారి ఘాట్లలో ముందుజాగ్రత్తగా 28 మంది గజ ఈతగాళ్ళను నియమించారు. అలాగే ఎనిమిది బోట్లను సిద్ధంగా ఉంచినట్లు ఎఫ్‌డిఒ కె రమణకుమార్ తెలిపారు.

08/03/2016 - 02:01

వనస్థలిపురం, ఆగస్టు 2: ఆర్థిక సమస్యలతో ప్రియురాలిని స్నేహితుని సహాయంతో హత్యచేసి ఆమె వద్ద ఉన్న నగలను తీసుకొని పారిపోయిన ఇద్దరు వ్యక్తులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతనెల 28న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ద్వారకామాయినగర్‌లో అనుమానాస్పద స్థితిలో గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే.

Pages