S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అర్ధాంతరంగా ఆగిన రోడ్డు పనులు!

ఒంటిమిట్ట, ఆగస్టు 2:ఏకశిలా రామయ్య అభివృద్ధి పనులు రాజకీయ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామాలయాన్ని టిటిడిలో విలీనం చేశాక, నిధులు మాత్రం అధికంగా ఉన్నా, పనులు మాత్రం సరిగా లేవంటూ రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించడంతో కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా నిలిపేశాడు. దీంతో ఆలయ అభివృద్ధి కుంటుపడింది. బ్రహ్మోత్సవాలకు ముందు సుమారు రూ.2 కోట్లకు పైగా మాడ వీధులకు టిటిడి టెండర్లు ఆహ్వానించింది. ఈ పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో మాడవీధులు చేశారే కాని, మిగిలిన రోడ్డుపనులు, పుట్‌పాత్ పనులు నిలిపేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కాంట్రాక్టర్ పుట్‌పాత్ పనులు చేపట్టగా నాసిరకంగా పనులు సాగుతున్నాయని టిడిపి, సిపిఎం నాయకులు ఆరోపించారు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపేయడంతో భక్తులు, పర్యాటకులు నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడ వీధులకు బయట సంజీవరాయస్వామి గుడి వద్ద నుండి హైవేని కలుపుతూ రోడ్డుపనులు ప్రారంభించారు. ఈ పనులకు మరో అటంకం ఏమైనా ఏర్పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అది ఏమిటంటే కేంద్ర పురావస్తు శాఖ అని చెప్పవచ్చు. మొదటి నుండి రామాలయ అభివృద్ధిపై పురావస్తు శాఖ సైంధవ పాత్ర పోషిస్తోంది. టిటిడిలోకి విలీనం కాక మునుపు ఆలయ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. భద్రాద్రి తెలంగాణలోకి వెళ్లడంతో ఈ రామయ్యకు గత వైభవం సంతరించుకునే వాతావరణం నెలకొంది. ఇపుడిపుడే రామయ్య సన్నిధి అభివృద్ధి వైపు అడుగులేస్తోంది. ఇటువంటి తరుణంలో మేం ఉన్నామంటూ అభివృద్ధి పనులకు పురావస్తు, అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదీ ఏమైనా పురావస్తు శాఖ, నాయకులు జరుగుతున్న అభివృద్ధి విషయంలో జోక్యంచేసుకోకుండా రామాలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.