S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 23:22

దేవరకద్ర, ఆగస్టు 2: బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకద్ర పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హల్‌లో హరితహారంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/02/2016 - 23:22

కొత్తకోట, ఆగస్టు 2: ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ రాణి మాకొద్దంటూ విద్యార్థులు సుమారు 2గంటల పాటు కొత్తకోటలో రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు కొత్తకోట చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.

08/02/2016 - 23:21

అలంపూర్, ఆగస్టు 2: అష్టాదశ శక్తీపీఠాలలో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను మంగళవారం ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి సన్నిదిలో ప్రత్యేక పూజలు, చండి హోమాలలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు.

08/02/2016 - 23:21

బాలానగర్, ఆగస్టు 2: మండలంలో 12లక్షల మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం బాలానగర్ మండలం ఎంపిడివో సమావేశ మందిరంలో హరితహార కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

08/02/2016 - 23:20

వనపర్తి, ఆగస్టు 2: మొక్కలు నాటి వాటిని పెంచి ప్రాణదాతలు కావాలని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని చౌడేశ్వరి ఆలయ ఆవరణలో, 17వ వార్డులోని రోడ్డు వెంట మొక్కలను నాటారు.

08/02/2016 - 23:20

కోయిలకొండ, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మండలంలో ఉద్యమంలా సాగుతుంది. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తన స్వంత మండలమైన కోయిలకొండకు హరితహరంలో జిల్లాలో ప్రత్యేక స్థానం ఉండాలని హరితహారంలో ప్రతీ అధికారి ప్రత్యేక శ్రద్ధ్ద పెట్టాలని కోరడంతో గ్రామాల్లో అధికారులు, హరితహారంలో మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ్ద వహిస్తున్నారు.

08/02/2016 - 23:18

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 2: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలపై నిర్భందం ఆపాలని, గ్రామాల్లో ప్రభుత్వమే ప్రజాభిపాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు మంగళవారం ఎఎస్పీ వెంకన్న, డిఆర్వో దయానంద్‌కు వినతి పత్రాలు సమర్పించారు.

08/02/2016 - 23:17

సంగారెడ్డి, ఆగస్టు 2: దేశాభివృద్ధికి పల్లెసీమలే పట్టుకొమ్మలని వేధికలపై వేద మంత్రాల్లా గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వాలను నడిపే ఏలికలు గ్రామాల్లో ప్రజల వౌలిక సదుపాయలకు కావల్సినన్ని నిధులు మంజూరు చేయడంలో మాత్రం చేతులెత్తి వేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి.

08/02/2016 - 23:17

మెదక్, ఆగస్టు 2: భారతదేశంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్న ముఖ్యమంత్రులలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నం.1 ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి మోదీ గుర్తించారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక సాయిబాలాజీ గార్డెన్స్‌లో మంగళవారం నాడు జరిగిన నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత స్థాయ సమావేశంలో ఆమె సుదీర్గంగా మాట్లాడారు.

08/02/2016 - 23:16

దౌల్తాబాద్, ఆగస్ట్ 2 : మల్లన్నసాగర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇష్టంలేదని సూరంపల్లి ఎంపిటిసి సభ్యురాలు అయ్యవారి మంగమ్మనర్సింలు పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Pages