S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 23:53

నల్లగొండ, ఆగస్టు 2: జిల్లాలో కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తున్న నేపధ్యంలో అధికార యంత్రాంగం పుష్కర ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భక్తుల పుష్కర స్నానాలకు అవసరమైన ఘాట్‌ల నిర్మాణం దాదాపుగా పూర్తి అవుతుండటంతో ఇక ఘాట్‌లకు వచ్చివెళ్లేందుకు భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, పార్కింగ్, హోల్డింగ్స్, మంచినీరు వంటి వౌలిక వసతుల కల్పన పనుల్లో వేగం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది.

08/02/2016 - 23:53

నల్లగొండ టౌన్, ఆగస్టు 2 :రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో డిటి ఎస్ ఎఫ్ ప్రమాదకర వ్యర్థముల నిర్వాహణ, నిల్వ కేంద్రాన్ని ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వినతిపత్రం అందించారు.

08/02/2016 - 23:52

నల్లగొండ టౌన్, ఆగస్టు 2 : తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు పన్నును రద్దు చేయాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నల్లగొండ కాంట్రాక్టు కారియర్ బస్సు అసోసియేషన్, మాక్సి క్యాబ్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఉపాధ్యక్షులు ఐతరాజు రమేష్‌ల అద్యక్షతన ఆర్ టి ఏ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున దర్నా నిర్వహించారు.

08/02/2016 - 23:51

నాగార్జునసాగర్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మొదటి సారిగా వచ్చిన కృష్ణా పుష్కరాలను 12రోజులపాటు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రా దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని పుష్కర పనుల పరిశీలనలో భాగంగా మంగళవారం నాగార్జునసాగర్‌లో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి పుష్కరాల పనులు పరిశీలించారు.

08/02/2016 - 23:50

కోదాడ, ఆగస్టు 2: 65వ, నెంబరు జాతీయరహదారి కోదాడ బైపాస్‌పై కట్టకొమ్ముగూడెం క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురయ్యారు. కోదాడ మండలం గోల్‌తండకు చెందిన బాణోతు ప్రసాద్, శ్రీహరిలు పట్టణంలోని వేర్వేరు కాలేజీల్లో చదువుతున్నారు.

08/02/2016 - 23:27

మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సురక్ష కాలనీలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

08/02/2016 - 23:27

మక్తల్, ఆగస్టు 2: భీమా ప్రాజెక్టు లిఫ్టు-2 వద్ద ఇరిగేషన్ చీఫ్ ఇంజనీయర్ ఖగేందర్, ఎస్‌ఇ భద్రయ్య, ఇఇ ఉదయ్‌శంకర్‌లపై జరిగిన దాడి సంఘటనలో సమాచారం ఇచ్చినప్పటికి కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమని, తాను కూడా ఓప్రభుత్వ అధికారన్నది ఎందుకు గుర్తుకు రాలేదని తెలంగాణ రాష్ట్ర ఇంజనీయర్స్ జెఎసి అధ్యక్షుడు వెంకటేషం అన్నారు. సమాచారం ఇచ్చినా స్పందిచక పోయినా పైగా ఇంజనీర్లపై కలెక్టర్ అభాండాలు మోపడం అన్యాయమన్నారు.

08/02/2016 - 23:26

మహబూబ్‌నగర్, ఆగస్టు 2: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం పాలమూరు జిల్లాకు వరంలాంటిదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ మడంలంలోని చౌదర్‌పల్లి, బొక్కలోనిపల్లిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అదేవిధంగా ఊటకుంట దగ్గర మిషన్ భగీరథ ( వాటర్‌గ్రిడ్) పనులకు శంకుస్థాపన చేశారు.

08/02/2016 - 23:25

మహబూబ్‌నగర్, ఆగస్టు 2: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కల్వకుర్తి ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు.

08/02/2016 - 23:23

కల్వకుర్తి, ఆగస్టు 2: విద్యార్థులకు వౌళిక సదుపాయాలు కల్పించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రధానోపాద్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. సమావేశంలో నియోజకవర్గంలోని పాఠశాలలో ఉన్న సమస్యలపై సమీక్ష చేశారు.

Pages