S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 00:07

పరకాల, అగస్టు 2: భూపాలపల్లి ఏరియాలో జూలైలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ పాలకుర్తి సత్తయ్య అన్నారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వర్షాల కారణంతో కెటికె ఓసిలో జూలై మాసంలో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగినప్పటికీ అండర్‌గ్రౌండ్ గనులు కొంత మేర ఉత్పత్తి పెంచుకొని ఏరియా ఉత్పత్తిలో కొంతమేరకు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

08/03/2016 - 00:07

భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అనేక స్వాతంత్య్రాలలో ముఖ్యంగా చెప్పుకోవలసినది వ్యక్తి స్వాతంత్య్రం. అందువలన ఎవరైనా తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించుకోవచ్చును. అయితే కొందరు మేధావులు, రాజకీయ నాయకులు అభివ్యక్తి స్వాతంత్య్రానికి హద్దులు లేవనుకుంటున్నారు. అవాకులు, చవాకులు ప్రేలుతున్నారు. వ్యక్తి స్వాతంత్య్రానికి, అభివ్యక్తీకరణ స్వాతంత్య్రానికి కొన్ని హద్దులు, పరిమితులు సహజంగానే ఉంటాయి.

08/03/2016 - 00:07

వరంగల్, ఆగస్టు 2: జిల్లాలో హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 2.04 కోట్ల మొక్కలు నాటామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మంగళవారం చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ హరితహారం పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుండి కలెక్టర్ వాకాటి కరుణ, కమీషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్‌బాబు, జెసి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

08/03/2016 - 00:06

వరంగల్, ఆగస్టు 2: వరంగల్ నగరం మున్సిపల్ కార్పొరేషన్ నుండి గ్రేటర్ వరంగల్‌కు నోచుకొని స్మార్ట్‌సిటీగా ఎదిగినా పట్టణ రూపురేఖలు మారడం లేదు. గ్రేటర్ పరిధిలోని అనేక కాలనీలు మురికి కాలువల మధ్య మగ్గుతున్నాయి. తేలికపాటి వర్షం కురిసినా లోతట్టు ప్రాంతాలు జలమయమై కాలనీల మధ్య ఉండే మురికి కాలువలతో కలిసి వర్షపు నీరు పొంగిపొర్లుతూ ఇళ్లలోకి చేరుకుంటోంది.

08/03/2016 - 00:06

వడ్డేపల్లి, ఆగస్టు 2: రాష్ట్రంలోని పట్టణాలలో నివసిస్తున్న పేద ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మించి ఇస్తానన్న డబుల్ బెడ్‌రూంల మాటలు నీటి మూటలుగానే మిగిలాయని రాష్ట్ర పట్టణ పేదల సంఘం సిఐటియు అనుబందం రాష్ట్ర అధ్యక్షులు నర్సింహారావు ఘాటుగా విమర్శించారు. మంగళవారం నగరంలోని పట్టణ పేదల సంఘం అధ్వర్యంలో 58 జిఓ ప్రకారం పట్టాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు.

08/03/2016 - 00:05

ముంబయకి చెందిన ఇస్లామిక్ బోధకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆయన వివాదాస్పద ప్రసంగాలు ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశాలయ్యాయి. యధావిధిగా ఆయన్ను బలపరిచే వాళ్లు ప్రస్తుతించేవాళ్లు బయలుదేరారు. మక్కా వెళ్లిన ఆయన ఈ తంతు చూసి ముంబయ రావడం మాని ఆఫ్రికా దేశాలకు వెళ్లాడు. మక్కానుంచి స్కైప్‌లో మీడియాతో మాట్లాడతానన్నాడు. అదీ రద్దయింది. ఆయనలో భయం ఎక్కువైంది.

08/03/2016 - 00:05

మంగపేట, ఆగస్టు 2 :మంగపేట గోదావరి ఫెర్రీ పాయింట్ వద్ద నిర్మించిన పుష్కరఘాట్‌కు మంగళవారం భక్తులు తక్కువ సంఖ్యలో విచ్చేశారు. మంగళవారం, అమావాస్య కావడంతో పుష్కర స్నానాలకు, పిండప్రదాన కార్యక్రమానికి మంగళవారం భక్తజనం స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. వచ్చిన కాస్తా భక్తులు కూడా పుష్కరఘాట్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పెదవి విరుస్తున్నారు.

08/03/2016 - 00:03

మోర్తాడ్, ఆగస్టు 2: మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట వద్ద పెద్దవాగు నిండుగా ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు కేవలం మొండివాగు జలాలు మాత్రమే పెద్దవాగులోకి మళ్లగా, రామన్నపేట ఉడిపివాగు మిగులు జలాలు కూడా పెద్దవాగులోకి మళ్లాయి. భీమ్‌గల్ కప్పలవాగు, వేల్పూర్ మోతె వాగు కూడా ప్రవహిస్తుండటంతో ఆ జలాలన్నీ పెద్దవాగులోకి మళ్లాయి. గాండ్లపేట వద్ద పెద్దవాగులో వరద ప్రవాహం పెరిగింది.

08/03/2016 - 00:02

నిజామాబాద్, ఆగస్టు 2: అధికార తెరాస పార్టీలో వర్గ విభేదాలు ఒక్కోటిగా బహిర్గతమవుతున్నాయి. ముఖ్య నేతలు వర్గాలుగా విడిపోయి అంతర్గత విభేదాలను రచ్చకీడుస్తుండడం పార్టీ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోంది. జిల్లా అంతటా ఈ విభేదాల పర్వం నెలకొని ఉన్నప్పటికీ, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో మాత్రం తెరాస నేతల విభేదాలు మరింత వేడిని రగిలిస్తున్నాయి.

08/03/2016 - 00:01

ఆర్మూర్, ఆగస్టు 2: జిల్లాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2650 కోట్లు కేటాయించిందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ యోగితారాణా అన్నారు. మంగళవారం ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో పైప్‌లైన్ల కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు.

Pages