S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 20:59

దీక్షాపంత్, ధన్‌రాజ్, షకలక శంకర్ ముఖ్యపాత్రల్లో నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రెజీనా, నందినిరెడ్డి, తనీష్, సంపూర్ణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

08/02/2016 - 20:58

జురాసిక్ పార్క్, జాస్, ఇండియాజోన్స్ వంటి చిత్రాల సృష్టికర్త స్టీవెన్ స్పిల్‌బెర్గ్ దర్శకత్వంలో వచ్చిన మరో ఫాంటసీ చిత్రం ‘బి.ఎఫ్.జి.’ (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్). డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

08/02/2016 - 20:57

అరటిపువ్వు కూర చేస్తారు. పువ్వుని రుబ్బి వడియాలు పెడతారు. ఇవి నేతిలో వేయించుకొని తింటే ఆయాసం, దగ్గు, రక్తవిరేచనాలు, అధికంగా మైల, స్తీల ఇతర వ్యాధులు తగ్గిస్తుంది. దీనితో వడలు, పులుసుకూర, ఉప్మాకూర, ఆవకూర, హల్వా, దోశెలు వంటివి చేసి తింటారు. పప్పుకూర, పాఠళీ కూడా చేస్తారు. అరటి పువ్వు దొప్పలు వలచి లోపలి పువ్వులు తీసి దానితో మాత్రం వండుతారు. ఎందుకంటే ఇవి ఉడకవు.
అరటిపువ్వు వడియాలు

08/02/2016 - 20:56

బాలీవుడ్ హాట్‌భామ అనుష్కశర్మ ఈమధ్య జోరుమీదుంది. వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తూ, మరోవైపు జోరుగా విరాట్‌కోహ్లీతో ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ ఇప్పుడు ఓ విషయానికి అడిక్ట్ అయిపోయిందట. దర్శక నిర్మాతలు ఈ విషయం విని షాక్ అవుతున్నారు. ఈ వ్యసనంవల్ల అనుష్క కెరీర్ నాశనం చేసుకుంటుందా ఏమో అని? ఔనా.. ఇంతకీ దేనికి అడిక్ట్ అయ్యిందనేగా మీ అనుమానం.

08/02/2016 - 20:53

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు మహేష్‌బాబు సరసన నటించే ఛాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్‌గా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, చివరగా రకుల్‌ను ఓకే చేశారు.

08/02/2016 - 20:46

రెండు పదులు దాటిన పరువం..జోరుగా..హుషారుగా సాగే సమయం. సాహసంతో సాగిపోవాలని కలలుకనే యువప్రాయం. ఈ తరుణంలో కేరింతలు, తుళ్లింతలతో పాటు వయసు 25ఏళ్లకు చేరువకాగానే ఆచీతూచీ అడుగు వేయాలని నిపుణులు చెబుతున్నారు. సంతోషాన్ని సొంతం చేసుకునేందుకు సాగరాన్ని సైతం ఈదెయ్యాలని తహతహలాడటంలో వెనుకంజ వేయనక్కర్లేదు కాని నిదానంగా జీవన ప్రయాణం సాగిస్తూ..

08/02/2016 - 20:43

కూరల్లో, తినుబండారాలన్నింటిలో ఉప్పు వేయక తప్పదు. కారణం రుచి వుండదు. పప్పులో ఉప్పు లేకపోతే నోట్లో పెట్టుకోలేం అనడం సహజం. ఎక్కువ వేసుకుంటే బి.పి తప్పదు. ప్రత్యేకించి అధిక రక్తపోటు, హృద్రోగాలు, కాళ్ళవాపు, మూత్రపిండాల వ్యాధుల వారుతీసుకుంటే ముప్పే.
ఉపయోగాల గురించి ఆలోచిద్దాం

08/02/2016 - 18:00

విజయవాడ : అనంతపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తిపై గన్నవరం విమానాశ్రయం వద్ద మంగళవారం హత్యాయత్నం జరిగింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే అతడి గొంతు కోసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం నుంచి నెల్లూరు వెళ్లేందుకు బాధితుడు అశోక్‌ లారీ ఎక్కాడని, గన్నవరం వరకు తీసుకొచ్చి గొంతు కోసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

08/02/2016 - 17:43

తిరుపతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో శ్రీవారి నమునా ఆలయం, రోజుకు లక్షమంది భక్తులు దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేయనుంది. బుధవారం పుష్కర యాత్ర తిరుమలలో ప్రారంభమై 7వ తేదీకి విజయవాడకు చేరనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

08/02/2016 - 17:38

విశాఖ : పరవాడలో జూనియర్‌ ఆర్టిస్టుల ఏజెంట్లు తనపై దాడి చేశారంటూ సినీ నిర్మాత అచ్చిబాబు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్‌ కథానాయకుడుగా అచ్చిబాబు నిర్మాణంలో సినిమాకు సంబంధించి పరవాడలో కొద్ది రోజులుగా షూటింగ్‌ జరుగుతోంది.

Pages