S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 00:15

యైటింక్లయిన్ కాలనీ, ఆగస్టు 2: జూలై మాసంలో సింగరేణి ఆర్జీ-2లో 4,86,300 టన్నులకు గాను 4,10,418 టన్నులతో 84శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు జిఎం విజయపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్జీ-2 జిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాస ఉత్పత్తి వివరాలను వెల్లడించారు.

08/03/2016 - 00:15

భీమదేవరపల్లి, ఆగస్టు 2: గౌరవెల్లి రిజర్వాయర్ నుండి దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామమైన వంగరకు సాగునీటిని 2018 సంవత్సరంలోగా అందిస్తామని హు స్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పేర్కొన్నారు. 1993లో ఆనాడు పివి ప్రధానిగా ఉన్న సమయంలో వంగరకు సాగునీటిని అందిస్తామన్నారు. నేడు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు నింపి దాని నుండి గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా వంగరకు సాగునీరు అందిస్తామన్నారు.

08/03/2016 - 00:14

మహదేవపూర్, ఆగస్టు 2: మండలంలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర త్రివేణి సంగమ తీరంలో జరుగుతున్న గోదావరి అంత్య పుష్కరాలు మంగళవారం 3వ రోజుకు చేరుకున్నాయి. అమవాస్య సందర్భంగా భక్తుల తాకిడి తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై గోదావరి పుణ్య స్నానాలు చేశారు. మహిళలు గోదావరి తల్లి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పూజలు చేశారు. పితృ దేవతలకు పిండ ప్రదానం చేశారు.

08/03/2016 - 00:14

అడవుల నరికివేతవల్ల వాతావరణం సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో సమతుల్యత లోపించి కాలుష్యం ఏర్పడి మానవకోటి కి నష్టం వాటిల్లుతోంది. దీని నివారణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరం వుంది. అడవుల నరికివేత,గుట్టలు తరిగిపోవడంతో వాతావరణంలో మార్పులు జరిగి అనేక అనారోగ్యాలతో ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయి.

08/03/2016 - 00:13

కోనరావుపేట, ఆగస్టు 2: మండలంలోని వెంకట్రావుపేటలో అప్పుల బాధతో నాలుక నాగరాజు (30) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం తెల్లవారు సమయంలో గ్రామ శివారులోని గుట్ట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఎడాది ఆరు ఎకరాలలో పంటలు వేయగా అవికి చేతికి అందక నష్టాల పాలైనట్టు తెలిసింది. అప్పుల బాధలు తీర్చడం మూడు ఎకరాలు భూమిని విక్రయించాడు.

08/03/2016 - 00:13

హుజూరాబాద్, ఆగస్టు 2: హుజూరాబాద్ పట్టణంలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన మైనారిటీ గురుకుల పాఠశాలను మంగళవారం ఎసిబి డి ఎస్పీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం కూడా రుచి చూశారు. రికార్డులను కూడా పరిశీలించారు.

08/03/2016 - 00:12

వెల్గటూరు, ఆగస్టు 2: మండల కేంద్రంలోని కోటిలింగాలకు వెళ్లే రహదారిలోని వాలుగు ఒర్రె పై నున్న లోలెవల్ వంతెన మంగళవారం ఎల్లంపల్లి గోదావరి బ్యాక్ వాటర్‌లో మునిగిపోవడంతో ముంపు గ్రామమైన కోటిలింగాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా బ్యాక్ వాటర్ పెరగడం, వెల్గటూరు వైపు నుండి గోదావరిలో కలిసే పెద్ద వాగు వర్షం కారణంగా ఉప్పొంగడంతో ఈ వంతెన మునిగిపోయింది.

08/03/2016 - 00:09

సంగెం, అగస్టు 2: పచ్చని మొక్కలు విరివిగా పెంచితేనే అందరి ఆరోగ్యాలు క్షేమంగా ఉంటాయని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మంగళవారం సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని నోటరి డేమ్ ఉన్నత పాఠశాలల్లో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు.

08/03/2016 - 00:08

జనగామ టౌన్, ఆగస్టు 2: జనగామలో అమలు చేస్తున్న 144సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మంగళవారం హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందచేసినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి రంగరాజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

08/03/2016 - 00:08

నర్సంపేట, ఆగస్టు 2: హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ఈనెల 7వ తేదీన జరిగే ప్రధానమంతి నరేంద్ర మోదీ సమ్మేళనం సభకు బిజెపి శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కోరారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంగళవారం సమ్మేళనం సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఎడ్ల అశోక్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు ఆవిష్కరించారు.

Pages