S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రగతిలో తెలంగాణకే అగ్రపీఠం

మెదక్, ఆగస్టు 2: భారతదేశంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్న ముఖ్యమంత్రులలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నం.1 ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి మోదీ గుర్తించారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక సాయిబాలాజీ గార్డెన్స్‌లో మంగళవారం నాడు జరిగిన నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత స్థాయ సమావేశంలో ఆమె సుదీర్గంగా మాట్లాడారు. గజ్వేల్‌లో మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు ప్రధానమంత్రి మోదీ తొలిసారిగా ఈ నెల 7న శంకుస్థాపన చేస్తున్నట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి మోదీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను స్వయంగా ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే నిర్వహించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రిని ఢిల్లీలో కలుసుకొని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ఆహ్వానించిన మేరకు ప్రధానమంత్రి అంగీకరించారన్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి గజ్వేల్ ప్రధానమంత్రి సభకు తెరాస కార్యకర్తలు 25 వేల మంది తరలివెళ్లాలని ఆమె తెలిపారు. కార్యకర్తలందరికీ గ్రామాల వారిగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్ర పనితీరుపై ప్రక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిశీలిస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో వేల చెరువులలో పూడికతీత పనులు, కట్టల అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుతున్నాయన్నారు. మహిళలు రోడ్లపైకి రాకుండా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టిందన్నారు. ఈ మంచినీటి పథకం చేపట్టిన ఏడాదిలోపే పైప్‌లైన్లు, ఫిల్టర్ బెడ్లు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. మన అధిష్టానం ప్రజలేనని ఆమె వెల్లడించారు. మెదక్ పట్టణంలో రోడ్ల అభివృద్ది కోసం 47 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలోని రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని రోడ్లన్ని అభివృద్దికి నోచుకున్నాయన్నారు. రెండు సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో 1150 కోట్లు నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇందులో ఘణపురం ఆనకట్ట అభివృద్దికి కోసం 110 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. మెదక్ జిల్లా హెడ్‌క్వార్టర్, రైల్వేలైన్, రోడ్ల అభివృద్ది, ఘణపురం ప్రాజెక్ట్ అభివృద్ది వంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. మెదక్ నియోజకవర్గాన్ని జిల్లాలోనే నం.1గా తీర్చిదిద్దుతానని పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 7న ప్రధానమంత్రి గజ్వెల్‌కు వచ్చే రోజు నాగుల పంచమి ఉందని ఆ రోజున తెరాస మహిళలు ఉదయం 9 గంటలకే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని 10 గంటలకు గజ్వెల్‌కు బయలుదేరాలని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి సభా వేధిక వద్దకు మద్యాహ్నాం 2:20 గంటలకు చేరుకుంటారని, కేవలం ఒక అరగంట మాత్రమే ప్రధానమంత్రి ప్రసంగం ఉంటుందని ఆమె తెలిపారు.
రైల్వేలైన్‌కు అధిక నిధులు రాబడతా: మెదక్ ఎంపీ
మెదక్ రైల్వేలైన్ త్వరితగతిన నిర్మించే పనులలో జాప్యం లేకుండా చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబడతానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. మెదక్ నియోజకవర్గ ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలకు నిధులు సేకరించి మెదక్ నియోజకవర్గ అభివృద్దికి ఆహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. ప్లోరైడ్ వాటర్‌కు పులిస్టాప్ పెట్టె విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను తొలిసారిగా ప్రధానమంత్రి ద్వారా శంకుస్థాపన చేయించడం ముఖ్యమంత్రి ఘనత స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ సమావేశానికి తెరాస రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌రావు, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, ఎంపిపిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, తెరాస కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.