S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 17:35

గుంటూరు : బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని వద్దాలపు నాగరాజు అనే యువకుడు మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్‌ ట్యాంకర్‌ కూచనపల్లి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

08/02/2016 - 17:33

హైదరాబాద్‌: ఎంసెట్‌-3 పరీక్ష సెప్టెంబర్‌ 11న నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ యాదయ్యను ఎంసెట్‌-3 కన్వీనర్‌గా నియమించారు.

08/02/2016 - 17:29

విశాఖ: అల్పపీడనంతో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. తూర్పు మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రెండు రోజుల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, పరిస్థితులను బట్టి వాయుగుండంగా మారవచ్చని అంచనా. కోస్తాలో పలుచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు , రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

08/02/2016 - 17:26

అనంతపురం: ఉరవకొండ మండలం పెద్దమొస్తూరులో ఫ్యాక్షన్ గొడవలతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలోఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.. మరోముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొలంలో పిల్లలు వేరుశనగ మొక్కలు తొక్కారని ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

08/02/2016 - 17:19

హైదరాబాద్‌: కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మంగళవారం నిర్మాణంలో ఉన్న ఆర్చ్‌ (కమాన్‌) కూలడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

08/02/2016 - 17:17

దిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం కింద రూ.500కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. ఏపీకి ఆర్థిక సాయంపై విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని తెలుగుదేశం పార్టీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

08/02/2016 - 14:45

ముంబయి: ఔరంగాబాద్‌ అక్రమ ఆయుధాల కేసులో ఏడుగురు దోషులకు ప్రత్యేక కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరికి 14ఏళ్లు, ముగ్గురికి 8ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2006లో జరిగిన ఈ కేసుకు సంబంధించి కోర్టు 12 మందిని దోషులుగా ఇటీవల నిర్ధారించింది. ముంబయి దాడుల (26/11) కేసులో నిందితుడు అబు జుందాల్‌ సహా ఏడుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది.

08/02/2016 - 13:55

కరీంనగర్‌: నకిలీ బంగారం అమ్ముతున్న ముగ్గురు ముఠా సభ్యులను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో కర్నూలుకు చెందిన మాజీ కానిస్టేబుల్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా నుంచి 3 లక్షల నగదు, మూడు బంగారం నాణేలు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

08/02/2016 - 13:53

దిల్లీ: లోక్‌సభలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రామహాజన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్పీకర్ సభను కొనసాగిస్తుండగా, మరోవైపు టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసనను కొనసాగిస్తున్నారు. నిరసన విరమించాలని స్పీకర్ కోరగా, ప్రత్యేక హోదా ప్రకటించేవరకు తమ నిరసన కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.

08/02/2016 - 13:49

దిల్లీ: గుజరాత్‌లో తాజాగా ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ కారకురాలు కాదని, ప్రధాని మోదీ పాలన వల్లే శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆనందీబెన్‌ను బలిపశువును చేసినప్పటికీ ఆమె పదవీ త్యాగం వల్ల గుజరాత్‌లో బిజెపి బలపడలేదన్నారు.

Pages