S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 12:43

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిడిపికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధులు, రాయితీలను ఎపికి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ధర్నాకు ముందు జరిగిన ఎంపీల భేటీలో నిర్ణయించారు.

08/01/2016 - 12:42

హైదరాబాద్: అదుపుతప్పిన లారీ ఓ నర్సరీలోకి దూసుకువెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన మదీనాగూడలో సోమవారం ఉదయం జరిగింది. కూకట్‌పల్లి నుంచి భెల్‌వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై బీభత్సం సృష్టిస్తూ నర్సరీలోకి దూసుకువెళ్లింది. అక్కడ పనిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరణించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

08/01/2016 - 06:32

లండన్, జూలై 31: విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అసహ్యమేసినా ఇదే వాస్తవం.. ఐరోపా శాస్తవ్రేత్తలు యూరిన్ నుంచి బీర్‌ను తయారు చేసే యంత్రాన్నొకదాన్ని కనుగొన్నారు. సౌరశక్తితో పనిచేసే ఈ యంత్రం మానవ మూత్రం నుంచి నీటిని, ఎరువును వేరు చేస్తుంది. ఈ ఎరువు బీరు ఉత్పాదక పంటలకు ఉపయోగపడుతుందిట. బెల్జియం ఘెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు ఈ దిశగా విజయవంతమైన పరిశోధనలు చేశారు.

08/01/2016 - 06:30

హైదరాబాద్, జూలై 31 : గోదావరి అంత్యపుష్కరాల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పుష్కరాలకు పెద్దగా ప్రచారం ఇవ్వలేదు. గోదావరి ఆదిపుష్కరాల సమయంలో భారీ ప్రచారం కల్పించినప్పటికీ, వర్షాలు సరిగ్గా లేక నదిలో నీరు లేక భక్తులకు అనేక ఇక్కట్లు ఏర్పడ్డాయి.

08/01/2016 - 06:29

సంగారెడ్డి/గజ్వేల్, జూలై 31: మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు మెదక్ జిల్లా సింగారం గ్రామం ముందుకొచ్చింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో ఆ గ్రామ ప్రజలు ఇందుకు అంగీకరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేస్తున్న నిర్వాసితులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.

08/01/2016 - 06:28

మహబూబ్‌నగర్, జూలై 31: కర్ణాటక, మహారాష్టల్రో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతూ తెలుగు రాష్ట్రాలను తాకింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జూరాలకు స్థిరంగా వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి సైతం వరద ఉదృతి కొనసాగుతోంది. ఇటు జూరాల, అటు సుంకేసుల డ్యాంల నుండి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూనే ఉంది.

08/01/2016 - 06:28

వరంగల్, జూలై 31: భారత ప్రధాని మోదీ ఈనెల 7న తెలంగాణ పర్యటన ఖరారైందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో తెలంగాణలో వౌలిక సదుపాయాల కల్పనకు 45 వేల కోట్లు కేటాయించిందన్నారు.

08/01/2016 - 06:27

కరీంనగర్, జూలై 31: ఓ వైపు కరవు..మరోవైపు ఉపాధి లేమి.. వెరసి నిరుద్యోగులు గల్ఫ్ దేశాలే ప్రత్యామ్నాయ ఉపాధి కేంద్రాలుగా భావిస్తూ ఆ వైపునకు అడుగులేస్తుండగా, అక్కడ కూడా వారికి నిరాశే ఎదురవుతోంది. లక్షల కొద్దీ అప్పులు చేస్తూ గల్ఫ్ అనే ‘ఆశ’ల దారిలో అంతులేని ప్రయాణం చేస్తున్నారు.

08/01/2016 - 06:26

హైదరాబాద్, జూలై 31: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీని విపక్షాలు రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకయిందనే విషయం తెలిసిన తరువాత ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.

08/01/2016 - 06:26

సూర్యాపేట, జూలై 31: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గత కొనే్నళ్లుగా సాగుతున్న నకిలీ డీజిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాల్సిన నీలిరంగు కిరోసిన్‌కు రసాయనాలను కలిపి నకిలీ డీజిల్‌ను తయారుచేస్తున్న తీరును చూసి పోలీసు అధికారులే నిర్ఘాంతపోయారు.

Pages