S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 15:45

దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా అడగనందునే ఎపిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపీలు నాటకాలాడుతున్నారని వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

08/01/2016 - 14:50

దిల్లీ: ఈ వారంలో రాజ్యసభ సమావేశాలకు పార్టీ సభ్యులెవరూ గైర్హాజరు కావొవ్వని భాజపా ఆదేశించింది. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం విప్‌ జారీ చేసింది. జీఎస్టీ బిల్లు ఈ వారంలో రాజ్యసభలో చర్చకు రానున్న నేపథ్యంలో భాజపా అధిష్ఠానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

08/01/2016 - 14:46

దిల్లీ: బాబ్లీ పర్యవేక్షక కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ కొనసాగుతుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాబ్లీ ప్రాజెక్టు పట్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆసక్తి లేదని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. మహారాష్ట్ర తరపున వాదించిన అంధ్యార్జున ఏపీని తొలగించాలని వాదనలు వినిపించారు.

08/01/2016 - 13:08

చెన్నై: పార్టీ ప్రతిష్టను మంటగలిపేలా ప్రవర్తించినందుకు అన్నాడిఎంకె ఎంపీ శశికళ పుష్పను ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సిఎం జయలలిత సస్పెన్షన్ వేటు వేశారు. డిఎంకె ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్నందుకు శశికళపై ఈ క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. దిల్లీ ఎయిర్‌పోర్టులో శశికళ తనపై దౌర్జన్యం చేస్తూ నాలుగుసార్లు చెంపపై కొట్టారని డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.

08/01/2016 - 13:06

దిల్లీ: ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భవంతుల్లో మాజీ ముఖ్యమంత్రులకు వసతి కల్పించనక్కర్లేదని సుప్రీం కోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా చాలామంది మాజీ సిఎంలు ఇప్పటికీ వివిఐపిల మాదిరి విలాసవంతమైన భవనాల్లో ఏళ్లతరబడి తిష్టవేశారు. వీరికి వివిఐపిల మాదిరి భారీ భవనాలు కేటాయించనవసర లేదని కోర్టు తీర్పు చెప్పడంతో చాలా మంది సిఎంలకు స్థాన చలనం తప్పదేమో.

08/01/2016 - 13:05

అనంతపురం: అప్పుల విషయమై భర్తతో గొడవ జరిగాక తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లిలో సోమవారం ఈ దారుణం వెలుగు చూసింది. అప్పుల విషయమై ఆదివారం సాయంత్రం ఆనందరెడ్డి, భారతి దంపతుల మధ్య గొడవ జరిగింది. స్థానిక పెద్దలు రాజీ కుదిర్చాక ఇంట్లోకి వెళ్లేందుకు భారతి అంగీకరించింది.

08/01/2016 - 12:45

నల్గొండ: గొల్లగూడ వద్ద సోమవారం ఉదయం రైలుకింద పడి రమేష్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చండూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న రమేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

08/01/2016 - 12:44

రాజమండ్రి: గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా సోమవారం రెండో రోజు పుణ్యస్నానాలు చేసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రాజమండ్రి, కొవ్వూరుతో పాటు పలు చోట్ల ఘాట్‌లలో భక్తులు భారీ సంఖ్యలో కనిపించారు. తెలంగాణలో భద్రాచలం, బాసర, మంచిర్యాల, గూడెం తదితర ప్రాంతాల్లో గోదావరి నదీ తీరాన భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

08/01/2016 - 12:44

వరంగల్: సిసి కెమెరాలను ధ్వంసం చేసి ఆంధ్రాబ్యాంకు శాఖలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఈ ఘటన మండల కేంద్రమైన పురవిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. దొంగలు బ్యాంకు తలుపులు బద్దలుకొట్టి సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. నగదు చోరీ చేయాలని యత్నించినా ఫలితం దక్కలేదు. సోమవారం ఉదయం బ్యాంకును తెరిచిన అధికారులు చోరీకి యత్నం జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

08/01/2016 - 12:43

దిల్లీ: రెండు రోజుల విరామం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు, లోక్‌సభలో రుణ రికవరీ బిల్లుపై చర్చ జరుగుతుంది.

Pages