S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 06:14

పుత్తూరు, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల మనోభావాలు దెబ్బతినకముందే ప్రత్యేక హోదా కేటాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు.

08/01/2016 - 06:14

విశాఖపట్నం, జూలై 31: రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టనున్నట్టు ఎపి పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లుపై సెప్టెంబర్ 5న ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, అప్పటికీ ఈ అంశంపై స్పష్టత రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

08/01/2016 - 06:13

రాజమహేంద్రవరం, జూలై 31: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉదయం ఆరు గంటలకు రాజమహేంద్రవరం సరస్వతి విఐపి ఘాట్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర ప్రజా ప్రతినిధులు పుణ్య స్నానాలు ఆచరించి, అంత్య పుష్కర క్రతువును లాంఛనంగా ఆరంభించారు. ప.గో. జిల్లా కొవ్వూరులో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు.

08/01/2016 - 05:23

వేదాయపాళెం, జూలై 31: నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్శిటీకి సంబంధించిన వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తమ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని గుర్తించిన అధికారులు ఆదివారం ఉదయం 10.30 గంటలకు వెబ్‌సైట్‌ను పూర్తిగా నిలిపివేశారు.
హెచ్చరికలతో పేజీ దర్శనం

08/01/2016 - 05:22

హైదరాబాద్, జూలై 31: బిజెపిపై తెదేపా ప్రారంభించిన మాటల యుద్ధం చేతల వరకూ వెళ్లడం అనుమానంగానే ఉంది. రెండురోజుల నుంచి బాబు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జరుపుతున్న చర్చలను బట్టి, ఎన్నికల ముందు వరకూ కేంద్రం నుంచి బయటకు రావడం అనుమానమేనన్న విషయం స్పష్టమవుతోంది.

08/01/2016 - 05:21

కడప/ మచిలీపట్నం/ మొగల్తూరు, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కడప, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు వ్యక్తులు నీట మునిగి చనిపోయారు. కడప జిల్లాలో పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి నీటిలో గల్లంతై ముగ్గురు బాలురు మృతి చెందారు. కడప నగరం దండోరా కాలనీకి చెందిన ఒక కుటుంబం పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లింది.

08/01/2016 - 05:20

హైదరాబాద్, జూలై 31: కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల తలెత్తే సామాజిక పరిస్థితులపై చేపట్టిన సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం పూర్తయింది. 6600 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ప్రధాన ఘట్టం పూర్తయినట్లే. సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం పూర్తయినందున ఆగస్టు 15వ తేదీ నాటికి ముసాయిదా నివేదిక సిద్ధమవుతుంది.

08/01/2016 - 05:19

తిరుపతి, జూలై 31: బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లో ఉన్న రోగి చిరంజీవిరెడ్డి (45) బంధువుల అనుమతితో ఆదివారం అవయవదానం చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. తిరుపతి గాంధీపురానికి చెందిన బి చిరంజీవిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని స్విమ్స్‌లో మెరుగైన వైద్యం కోసం చేరారన్నారు.

08/01/2016 - 05:19

ధర్మపురి, జూలై 31: ఒకనాడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న భారత దేశానికి పునర్వైభవం తేవాలని, ఇందుకు దేశాన్ని శక్తివంతంగా చేయడానికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అత్యవసరమూ, అనివార్యమని గుంటూరు దత్త పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ ఉద్ఘాటించారు.

08/01/2016 - 05:18

హైదరాబాద్, జూలై 31 : తెలంగాణ ఎంసెట్-2 (మెడికల్) పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమైంది. ఎమ్సెట్ రద్దు అంటూ కేవలం ఒక ప్రకటన ఇవ్వడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, రుజువులతో సహా ప్రకటించాల్సి ఉంది. అందుకే సిఐడి నివేదికను ప్రభుత్వం ఉపయోగించుకునేందుకు నిర్ణయం తీసుకుంది.

Pages