S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 18:02

హైదరాబాద్‌: పాతబస్తీలోని అక్కన్న మాదన్న ఆలయం వద్ద అమ్మవారి వూరేగింపు సోమవారం ప్రారంభమైంది. వూరేగింపును నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం ప్రారంభమైంది. అమ్మవారి భక్తురాలు అనురాధ పచ్చికుండపై నిల్చుని భవిష్యవాణిని విన్పించనున్నారు.

08/01/2016 - 17:59

దిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌కు మార్గం సుగమమైంది. రెజ్లింగ్‌ 74 కిలోల విభాగంలో భారత్‌ తరఫున నర్సింగ్‌ యాదవ్‌ బరిలో దిగనున్నాడు. డోపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కు భారత డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. రియోకు సిద్ధమైన నర్సింగ్‌ డోపింగ్‌ పరీక్షలో దొరికిపోయాడు.

08/01/2016 - 17:16

దిల్లీ: జీఎస్‌టీ బిల్లును ఈ నెల 3న రాజ్యసభ ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భాజపా ఇప్పటికే తన పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్‌ జారీచేసింది. జీఎస్‌టీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయని సభముందుకు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

08/01/2016 - 17:02

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైదని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ సోమవారం తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది.

08/01/2016 - 16:35

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.75వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 49 పాయింట్లు నష్టపోయి 28,003 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 8,636 వద్ద స్థిరపడింది.

08/01/2016 - 16:33

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మార్చి 2016 వరకు రూ.6,403 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ సోమవారం రాజ్యసభలోతెలిపారు. రెవెన్యూ లోటు కింద రూ.2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.700 కోట్లు, నూతన రాజధానికి రూ.2050 కోట్లు, పోలవరానికి రూ.850 కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెదేపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

08/01/2016 - 16:21

దిల్లీ: రాయితీ వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.1.93 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నెల వ్యవధిలో రాయితీ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. దిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్‌ ధర రూ.423.09గా ఉంది. వంటగ్యాస్‌, కిరోసిన్‌ రాయితీలను తగ్గించేందుకు ప్రభుత్వం నెలవారీగా ధరలను పెంచే పద్ధతిని చేపట్టింది. ఇప్పటికే ప్రతినెలా లీటర్‌ కిరోసిన్‌పై రూ.25 పెంచాలని నిర్ణయించగా..

08/01/2016 - 15:47

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు దిల్లీలో ధర్నా ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ కోసం కసరత్తు చేయాల్సిందిగా వెంకయ్యకు మోదీ చెప్పినట్లు సమాచారం. సిఎం చంద్రబాబుతో మాట్లాడాల్సిందిగా కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీలకు ప్రధాని ఆదేశించారని తెలిసింది.

08/01/2016 - 15:46

కరీంనగర్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెవైఎం కార్యకర్తలు సోమవారం ఇక్కడ పెద్దఎత్తున ఆందోళన చేశారు. పురపాలక సంఘాలకు సంబంధించి మంత్రి కెటిఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతున్న ప్రాంగణంలోకి ఆందోళనకారులు ప్రవేశించి నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ప్రవేశించి కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.

08/01/2016 - 15:46

కాకినాడ: పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల సందర్భంగా శంఖవరం మండలం మండపం గ్రామంలో సోమవారం ఉదయం టిడిపి, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పదిమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత కారణంగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Pages