S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 03:16

విజయవాడ, జూలై 31: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యతలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో విదేశీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు ఇప్పటినుంచే తన వంతు ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వ వ్యూహరచనలో భాగంగా అవసరమైన సివిల్ ఇంజనీర్లను సమీకరించేందుకు కొన్ని దళారీ ఏజెన్సీలు తాజాగా రంగంలోకి దిగాయి.

08/01/2016 - 03:13

హైదరాబాద్, జులై 31: ఆయారాం గయారాంల సంస్కృతి నిరోధించాలంటే పార్టీ ఫిరాయింపుదారులపై చర్య తీసుకునే అధికారాన్ని సభాపతులకు కాకుండా ఎన్నికల సంఘానికే అప్పగించాలని న్యాయకోవిదులు, రాజకీయ సీనియర్లు అభిప్రాయపడ్డారు. ‘పార్టీల ఫిరాయింపులు- స్పీకర్ల పాత్ర’ అంశంపై జన చైతన్య వేదిక ఆదివారం నిర్వహించిన సదస్సుకు పలువురు మాజీ న్యాయమూర్తులు, రాజకీయ సీనియర్ నేతలు హాజరయ్యారు.

08/01/2016 - 03:11

గుంటూరు, జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించిన అంశాలపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ నెల 8న సిఆర్‌డిఏ అధికారులు ప్రాథమిక సమావేశం (ప్రీ బిడ్ కాన్ఫరెన్స్) నిర్వహించాలని నిర్ణయించారు.

08/01/2016 - 02:44

విజయవాడ, జూలై 31: పుష్కరనగర్‌లలో యాత్రికులకు అందించే సేవలపై ఈనెల 4న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ వెల్లడించారు. ప్రత్యేకాధికారి బి.రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిసిపి క్రాంతిరాణా ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన పుష్కరనగర్ నిర్మాణాలను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు.

08/01/2016 - 02:42

విజయవాడ, జూలై 31: ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ 1991 బ్యాచ్ విద్యార్థులు 2016 జూలైలో తమ సిల్వర్ జూబ్లీ రీ యూనియన్ గురించి యోచిస్తుండగా మీ నేస్తం ఎస్‌ఎస్‌ఎం ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటుకు దారి తీసింది. దీని అధికారిక ప్రారంభం ఆదివారం ఓ హోటల్‌లో జరిగింది. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఈ సొసైటీ లక్ష్యం.

08/01/2016 - 02:40

మచిలీపట్నం, జూలై 31: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితురాలి పుట్టినరోజు వేడుక ఇద్దరి జీవితాలనే కడతేర్చింది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన టేకుపూడి అక్షిత(19) తన జన్మదినం కావటంతో అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు అమర్లపూడి ప్రవీణ్ జై(20), పొన్నం ఆదర్శ్(21), నల్లమోతి వినయ్ ప్రమోద్(20), యడ్ల స్వాతి(19)తో కలిసి ఆదివారం మంగినపూడి బీచ్‌కు విహార యాత్రకు వచ్చారు.

08/01/2016 - 02:40

మచిలీపట్నం, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తమ ఓర్పు, సహనాన్ని పరీక్షించవద్దని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలన్నారు.

08/01/2016 - 02:39

బంటుమిల్లి, జూలై 31: ఆంధ్రుల సెంటిమెంటు ప్రత్యేక హోదా అని, దానికోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్పష్టం చేశారు. ఆదివారం నాగేశ్వరరావుపేటలోని స్వగృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో కాగిత మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను చూసి ఓర్వలేక అధికార దాహంతో నాటి యుపిఎ ప్రభుత్వం రెండు ముక్కలు చేసి ప్రజాగ్రహానికి గురై భూస్థాపితమైందన్నారు.

08/01/2016 - 02:39

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 31: ఈ ఏడాది కూడా రైతన్నలను ఖరీఫ్ సాగు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంట కాలువల్లో అరకొరగా వదిలిన నీటిని రాత్రీ పగలు తేడాలేకుండా డీజిల్ ఇంజన్ల సహాయంతో తోడి నాట్లు వేస్తున్నారు. వ్యవసాయానే్న జీవనాధారంగా చేసుకున్న జిల్లా రైతన్నలు ఖరీఫ్ సాగు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

08/01/2016 - 02:38

మచిలీపట్నం (కల్చరల్), జూలై 31: ప్రతి ఒక్కరికీ తొలి గురువు మాతృమూర్తి అని మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డా. ఎం రామకృష్ణ అన్నారు. స్థానిక హిందూ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం శ్రీ బాలాజీ విద్యాలయం పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డా. రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ప్రతిఒక్కరూ తల్లి, తండ్రి, గురువులను పూజించాలన్నారు.

Pages