S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 05:17

రాజమహేంద్రవరం, జూలై 31: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ జి సంజీవరెడ్డి వెల్లడించారు. ఈ సమ్మెలో సుమారు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు.

08/01/2016 - 05:17

హైదరాబాద్, జూలై 31: నిజంగా జనంలో హోదా సెంటిమెంట్ ఉందా? లేక దాన్ని రేపుతున్నారా? అదీగాకపోతే దాన్ని అడ్డుపెట్టుకుని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయా? ఇప్పుడు నవ్యాంధ్రలోని అన్ని వర్గాల్లోనూ జరుగుతున్న చర్చ ఇది.

08/01/2016 - 05:16

హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్శిటీల్లో ఉన్నాయని, లౌకిక విద్య కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యూ ఢిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు.

08/01/2016 - 03:53

హైదరాబాద్, జూలై 31: కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న రెండు అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఎపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఎపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసి 10 రోజులు గడచినా మంత్రి ఉమాభారతి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఏపి ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.

08/01/2016 - 03:42

హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్‌కు టెండర్ల ప్రక్రియ మొదలైంది. బిడ్డర్లు ఆగస్టు 20కల్లా టెండర్ల దాఖలు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం రూ. 350 కోట్లతో 83.45 మీటర్ల ఎత్తుతో ఐదు బ్లాకులుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్‌ను నిర్మించనుంది. గరిష్ఠంగా 21 నెలల కాల పరిమితిలో టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది.

08/01/2016 - 03:35

హైదరాబాద్, జూలై 31: గోదావరి అంత్య పుష్కరాల్లో జనం పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్కరాలకు పెద్దగా ప్రచారం ఇవ్వలేదు. గోదావరి ఆది పుష్కరాల సమయంలో భారీ ప్రచారం కల్పించినప్పటికీ, వర్షాలు సరిగ్గాలేక నదిలో నీరు లేక భక్తులకు అనేక ఇక్కట్లు ఏర్పడ్డాయి.

08/01/2016 - 03:33

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకైందని పోలీసులకు సమాచారం అంది 12రోజులు గడిచింది. ఈనెల 19న ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకైందంటూ కొంతమంది విద్యార్థుల తల్లితండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో సిఐడి రంగంలోకి దిగింది. రాష్టవ్య్రాప్తంగా 50 వేలమంది విద్యార్ధులను క్షోభకు గురి చేసిన ఎమ్సెట్-2 లీకేజి కేసులో ఇంతవరకు సిఐడి పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

08/01/2016 - 03:31

హైదరాబాద్, జూలై 31: కొత్త జిల్లాలపై ప్రభుత్వం ప్రకటించిన రోడ్ మ్యాప్ ప్రకారం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కలెక్టర్ నుంచి ఎమ్మార్వో వరకు రెవిన్యూ శాఖ మొత్తం హరితహారంలో తలమునకలు కావడంతో కొత్త జిల్లాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. రెండు వారాలపాటు మాత్రమే కొనసాగాల్సిన హరితహారాన్ని జూలై నెలాఖరు వరకూ పొడిగించడంతో కొత్త జిల్లాల ముసాయిదా ఖరారుపై అధికారులు దృష్టి సారించలేకపోయారు.

08/01/2016 - 03:21

విజయవాడ, జూలై 31:‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య. రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయించే అంశం. ఇటువంటి అంశాన్ని సానుకూలంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానికి, కేంద్రానికి లేదా? ప్రధాని రెండు గంటలు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

08/01/2016 - 03:18

విజయవాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగుదేశం ఎంపిలు చంద్రబాబు ఎదుట ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. కేంద్రం వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రంలో మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.

Pages