S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 06:21

విజయవాడ, జూలై 31: మార్కెట్ సంస్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇతోధిక కృషిలో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లోను ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, దుగ్గిరాల, కడప, కర్నూలు, ఆదోని, ఎన్నిగనూరు, హిందూపురం, కల్యాణ దుర్గంలో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు జరిపి పోటీ ధర కల్పించడంతో పాటు లావాదేవీలన్నీ పారదర్శకతతో జరుగుతున్నాయి.

08/01/2016 - 06:20

మేడికొండూరు, జూలై 31: ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాకొట్టగా బోల్తాపడివున్న ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు జోసిల్ కంపెనీ వద్ద ఆదివారం జరిగింది.

08/01/2016 - 06:20

విశాఖపట్నం, జూలై 31: గల్లంతైన వాయుసేన విమానం ఎఎన్-32 శకలాలు విశాఖ జిల్లా నాతవరం మండలం అటవీ ప్రాంతంలో ఉన్నట్టు అందిన సమాచారం వట్టిమాటగా తేలింది. సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు రెండు రోజుల కిందట వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా అటు వాయుసేన, ఇటు అటవీశాఖ బృందాలు విస్తృత గాలింపు జరిపాయి. నాతవరం మండలం సరుగుడు పరిసర అటవీ ప్రాంతాల్లో రెండు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది గాలింపు జరిపాయి.

08/01/2016 - 06:19

ఏలూరు, జూలై 31: డ్రైవర్ అప్రమత్తత కారణంగా రాయగడ నుంచి విజయవాడ వెళుతున్న పాసింజర్ రైలుకు ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఏలూరు - వట్లూరు రైల్వే స్టేషన్ మధ్యలో ఇంజను పట్టాలు తప్పడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. పట్టాలు తప్పిన సమయంలో రైలు కేవలం 30 కిలోమీటర్ల వేగంలో వెళుతుండటంతో నిలుపుదల చేసేందుకు వీలుకలిగింది.

08/01/2016 - 06:18

భద్రాచలం, జూలై 31: గోదావరి నది అంత్య పుష్కరాల సందర్భంగా భద్రాచలం పవిత్ర గోదావరిలో భక్తులు భారీ ఎత్తున పుణ్యస్నానాలు చేశారని ఐటీడీఏ పీవో, ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు.

08/01/2016 - 06:18

ఒంగోలు, జూలై 31: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. ఒంగోలులో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ హోదా కోసం జపాన్ తరహాలో శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. ప్రజలకు చేరవయ్యేందుకే కారణాలను వెతుక్కునే పరిస్థితి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిందని కెఇ ధ్వజమెత్తారు.

08/01/2016 - 06:17

హైదరాబాద్, జూలై 31:తెలంగాణలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టిడిపిలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని ఇతర నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టిడిపి, తెలంగాణ ఏర్పడిన తరువాత వెలవెలబోయింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో సైతం చివరకు 15 స్థానాల్లో విజయం సాధించినా, ఆ తరువాత పరిణామాలతో పూర్తిగా బలహీనపడింది.

08/01/2016 - 06:16

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ జిల్లా ఎస్పీలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ సీరియస్ అయ్యారు. ప్రజా ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల నుంచి తమకు పనులు కావడం లేదంటూ ప్రజలు తన దగ్గరకు వస్తున్నారని, ఎస్పీలు టైం ఇవ్వడం లేదంటున్నారని ఇకపై ఇలాంటి ఫిర్యాదులు సహించేది లేదని డిజిపి మందలించారు.

08/01/2016 - 06:16

హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్‌లో మళ్లీ రేబిస్ కలకలం మొదలైంది. గత ఆరు నెలల క్రితం రేబిస్ వ్యాధితో నలుగురు చిన్నారులు మృతి చెందగా 12 మంది చికిత్స పొందారు. తాజాగా నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో ఆదివారం ఓ రేబిస్ కేసు నమోదైంది. ప్రస్తుతం రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

08/01/2016 - 06:15

హైదరాబాద్, జూలై 31: ముఖ్యమంత్రి సెక్యూరిటీలో అలసత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ విభాగానికి చెందిన ముఖ్య భద్రతాధికారి వాసుదేవరెడ్డి రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. దీంతో ఆయన్ను అక్కడి విధుల నుంచి తప్పించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తున్న వాసుదేవరెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఫైరింగ్ ప్రాక్టిస్ చేయిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.

Pages