S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 07:40

న్యూఢిల్లీ, జూలై 29: పాకిస్తాన్‌లో వచ్చే నెల 4వ తేదీన జరిగే సార్క్ దేశాల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్‌కు, పాకిస్తాన్ నాయకులకు మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సమవేశం ఉండదని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ శుక్రవారం స్పష్టం చేశారు.

07/30/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విదేశీ, దేశీయ గ్రాంట్లు పొందే స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) వాటి ఎగ్జిక్యూటివ్‌లు తమ ఆస్తులు, అప్పుల వివరాలను పొడిగించిన గడువు అయిన డిసెంబర్ 31లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.

07/30/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 29: సమాజంలో అన్ని రకాల హింసలకు గురవుతున్న మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మహిళా,శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. బాధిత మహిళలకు వైద్య, న్యాయ సహాయం అన్నీ ఒకే చోట లభించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా 660 వన్ స్టాప్ సెంటర్లు(ఒఎస్‌సి)లు ఏర్పాటు చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.

07/30/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఏడో వేతన సంఘం సిఫార్సులకు సంబంధించిన ఎరియర్స్ అన్నీ కూడా ఒకేసారి ఆగస్టు వేతనాలతో కలిపి ఇవ్వాలని శనివారం నిర్ణయించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఉద్యోగులకు ఇప్పటికే 2.57రెట్లు మూలవేతనం పెరిగింది. 125శాతం డిఏ పెరిగింది. మొత్తంమీద 23.5శాతం పెరుగుదల జరిగింది.

07/30/2016 - 07:38

న్యూఢిల్లీ, జూలై 29: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన 14 ఏళ్ల తుషార్ తలావత్ అంతర్జాతీయ గణిత శాస్త్ర పోటీలో విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాలలో చదువుతున్న తుషార్ ఇటీవల ఇండోనేసియాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథెమెటిక్స్ కాంపిటీషన్‌లో నెగ్గడం ద్వారా తాను చదువుతున్న ‘గురుకులానికి’ కీర్తి ప్రతిష్ఠలను తీసుకొచ్చారు.

07/30/2016 - 07:37

ఫిలడెల్ఫియా, జూలై 29: అమెరికాలో అధికార పక్షమైన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కనె్వన్షన్‌లో అతి చిన్న వయసు గల డెలిగేట్‌గా భారత సంతతికి చెందిన 18 ఏళ్ల యువతి శ్రుతి పలనియప్పన్ అందరి దృష్టిని ఆకర్షించారు. సెడార్ రాపిడ్స్ నుంచి ఈ కనె్వన్షన్‌కు వచ్చిన శ్రుతి హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నారు. హిల్లరీ క్లింటన్‌కు ఆమె గట్టి మద్దతుదారు.

07/30/2016 - 07:36

న్యూఢిల్లీ, జూలై 29: పిఎఫ్ కనీస పింఛనును నెలకు రూ 3 వేల రూపాయలకు పెంచాలని, ఉద్యోగుల పింఛను పథకాన్ని సమీక్షించాలని, ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్)లో ప్రభుత్వ వాటాను పెంచాలని శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

07/30/2016 - 07:28

హైదరాబాద్, జూలై 29: కరీంనగర్ జిల్లా రామగుండం రసాయనాలు, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణతో తెలంగాణలో సుమారు 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.

07/30/2016 - 07:27

హైదరాబాద్, జూలై 29: వచ్చే నెల ఏడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని, ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు.

07/30/2016 - 07:26

హైదరాబాద్, జూలై 29: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు భూ సేకరణ త్వరలోనే పూర్తవుతుందని, ప్రస్తుతం ఇది చివరి దశకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. 12 లక్షల ఎకరాలకు నీటిని అందించే ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Pages