S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళల కోసం 660 వన్ స్టాప్ సెంటర్లు

న్యూఢిల్లీ, జూలై 29: సమాజంలో అన్ని రకాల హింసలకు గురవుతున్న మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మహిళా,శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. బాధిత మహిళలకు వైద్య, న్యాయ సహాయం అన్నీ ఒకే చోట లభించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా 660 వన్ స్టాప్ సెంటర్లు(ఒఎస్‌సి)లు ఏర్పాటు చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. నిర్భయ నిధి నుంచి ఒఎస్‌సిల నిర్వహణకు నిధులు సమకూర్చనున్నట్టు ఆమె తెలిపారు. మొట్టమొదటి సారిగా గత ఏడాది ఏప్రిల్‌లో ఇలాంటివి 17 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు మేనకాగాంధీ స్పష్టం చేశారు. తొలి దశలో ఏర్పాటైన ఒఎస్‌సిలు విజయవంతంగా పనిచేస్తున్నందున 2017 ఏప్రిల్ నాటికి మరో 150 సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు.‘అవసరాన్ని బట్టి దేశవ్యాప్తంగా 660 వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’అని సభలో ఆమె వెల్లడించారు. బాధిత మహిళలకు వైద్య సహాయం, పోలీసుల సాయం, న్యాయ సలహాలు, మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ కల్పించనున్నట్టు లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అనుబంధ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అంతేకాకుండా బాధితురాలికి తాత్కాలిక పునరావసం కల్పిస్తారని మేనకాగాంధీ పేర్కొన్నారు.