S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయండి

హైదరాబాద్, జూలై 29: వచ్చే నెల ఏడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని, ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, సింగరేణి సిఎండి శ్రీ్ధర్, మెదక్ కలెక్టర్ రోనాల్డ్ రోస్, వివిధ శాఖల అధికారులు, ఎన్‌టిపిసి, ఎఫ్‌సిఐఎల్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ఎం వెంకయ్యనాయుడు, పియూష్ గోయల్, థామర్, అనంతకుమార్, ప్రధాన్, సురేష్ ప్రభు తదితరులు హాజరవుతారని ముఖ్యమంత్రి తెలిపారు. గజ్వేల్‌లో జరిగే కార్యక్రమంలోనే ప్రధానమంత్రి మిషన్ భగీరథను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను, రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటు, వరంగల్ ఆరోగ్య విశ్వవిద్యాలయంకు శంకుస్థాపన చేస్తారు. జైపూర్‌లో నెలకొల్పిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.