S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 05:20

హైదరాబాద్, జూలై 29: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం రెండు శాఖల మంత్రుల మధ్య చిచ్చురేపుతోంది. విద్యాశాఖ-వైద్య శాఖ మంత్రుల మధ్య అగాధం ఏర్పడింది. వాస్తవంగా ఎంసెట్ తేదీ ఖరారు, పరీక్షల నిర్వహణ, పరీక్షా పేపర్లను డ్రా విధానంలో తీయడం, ఎమ్సెట్ ఫలితాల వెల్లడి తదితర అంశాలన్నీ ఉన్నత విద్యాశాఖ పరిధిలో కొనసాగాలని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

07/30/2016 - 05:18

కర్నూలు, జూలై 29: తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని సిఐడి అధికారులు శుక్రవారం కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న సూరజ్ గ్రాండ్ హోటల్‌లో బసచేసిన వెంకటరమణ, తరుణ్‌ను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

07/30/2016 - 05:16

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి (టిడిపి) మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు.

07/30/2016 - 05:15

న్యూఢిల్లీ,జూలై 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రెండు సంవత్సరాలుగా నానుతున్న ఊహాపోహలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కుండబద్దలు కొట్టింది. ఈ అంశంపై ఇకపై ఎలాంటి అంచనాలకు తావులేకుండా తాను చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పేసింది. పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వటం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

07/30/2016 - 04:02

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో సూత్రధారిగా భావిస్తున్న షేక్ రమేష్ అనే వ్యక్తిని సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కర్నూలులోని ఒక హోటల్ వద్ద తరుణ్‌రాజ్, వెంకటేష్‌లను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.

07/30/2016 - 03:57

మా రాష్ట్రానికి మీరు చేసిందేమిటి?
మీ మాటలకు చేతలకు పొంతనేదీ?
విపక్షాలన్నీ ఏకమై కోరినా హోదా ఇవ్వరా?
కేంద్రంపై మండిపడిన చంద్రబాబు
కాంగ్రెస్ వాకౌట్ ఓ డ్రామా
మాకు న్యాయం చేస్తామంటే ఏ కమిటీకైనా ఓకే
న్యాయం జరుగుతుందంటేనే ఇక ఢిల్లీకి
కుండబద్దలు కొట్టిన సిఎం

07/30/2016 - 03:49

విశాఖపట్నం, జూలై 29: వనం - మనం కార్యక్రమంలో భాగంగా 2029 నాటికి 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యమని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోనున్న పార్కులో 67వ వనమహోత్సవంలో భాగంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జెసి-2 డి.వెంకటరెడ్డి తదితరులు శుక్రవారం మొక్కలు నాటారు.

07/30/2016 - 03:48

విశాఖపట్నం, జూలై 29: కుజస్తంభన, కాలసర్ప దోషాలున హరించే శక్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉందని షణ్ముఖ స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. రుషికేష్ పర్యటనలో ఉన్న స్వరూపానంద సరస్వతి స్వామి అదైకృతిక సందర్భంగా శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/30/2016 - 03:48

విశాఖపట్నం, జూలై 29: విశాఖ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. భాగస్వామ్య సదస్సు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన అనంతరం బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల మధ్య ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపుపై ఇటీవల విశాఖలో రెండు రోజుల సమావేశం జరిగింది. తాజాగా వేగంగా జరుగుతున్న పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల సమావేశం విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు.

07/30/2016 - 03:47

విశాఖపట్నం, జూలై 29: వనరక్షణే జనరక్షణ, 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రం గ్రీన్ జోన్‌గా నిలవాలని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 67వ వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమంలో నగరంలోని కంబాలకొండ ఎకో పార్కులో ఆయన మొక్కలు నాటారు.

Pages