S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 13:58

హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వైకాపా అధినేత జగన్‌ శనివారం మీడియాతో చెప్పారు. ప్రత్యేక హోదాపై భాజపా కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. చంద్రబాబు, భాజపా నేతలు ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

07/30/2016 - 13:55

నల్గొండ : పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని పాముకాటుకు గురైంది. అనాజిపురం ఆదర్శ పాఠశాలలో శనివారం పాముకాటుకు గురైన విద్యార్థిని స్వప్నను సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/30/2016 - 13:48

పట్నా: బిహార్‌లో వరదల కారణంగా 26మంది మృతి చెందగా, పుర్నియా, కతిహర్‌, మధెపురా, అరేరియా, సహర్సా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 22లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విపత్తు కారణంగా పంటలతో పాటు గుడిసెలు, పలు పక్కా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

07/30/2016 - 12:27

మహబూబ్‌నగర్‌ : అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను పోలీసులు గృహ నిర్భందంలో ఉంచారు. శుక్రవారం రాత్రి ఐజ పట్టణంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను అరెస్టు చేయగా, శనివారం ఉదయం స్టేషన్‌ నుంచి క్యాంపు కార్యాలయానికి తరలించి గృహనిర్భందంలో ఉంచారు. శుక్రవారం రాత్రంతా శాంతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు.

07/30/2016 - 12:05

హైదరాబాద్‌ : గంజాయి రవాణ కేసులో పట్టుపడ్డ ప్రధాన నిందితుల ఆస్తులను పోలీసులు జప్తుచేస్తున్నారు. హయత్‌నగర్‌ పోలీసులు మూడు బృందాలుగా వెళ్లి నిందితుల ఇళ్లలో శనివారం సోదాలు చేపట్టారు. చింతల్‌లో పసుపులేటి శివ, రాంపల్లిలో పురమని శ్రీనివాసరెడ్డి , నాగారంలో వక్కంటి శ్రీనివాసరావు ఇళ్లపై పోలీసులు దాడిచేసి స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకుంటున్నారు.

07/30/2016 - 12:04

ఏలూరు: ఆరంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మరణించిన ఘటన పెరవలి వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. హైవేపై పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎఎస్‌ఐ ధన్‌రాజ్ బైక్‌పై వెళుతుండగా ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఎఎస్‌ఐ అక్కడికక్కడే మరణించాడు. ధన్‌రాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

07/30/2016 - 12:03

ఒంగోలు: మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం వద్ద శనివారం ఉదయం ఓ కారును ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. కారులో వెళుతున్న వారిలో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు.

07/30/2016 - 12:03

కాకినాడ: తమ గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ చర్చి ఫాదర్‌ను గొంతు కోసి మావోయిస్టులు హతమార్చిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో సుమారు 200 మంది మావోయిస్టులు ప్రవేశించారు. చర్చి ఫాదర్ మారయ్యను వారు కొంత దూరం తీసుకుపోయి గొంతు కోసి చంపేశారు.

07/30/2016 - 12:02

హైదరాబాద్: అర్ధరాత్రి వేళ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులపై దొంగలు కాల్పులు జరిపిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పరిగిలో ఓ బ్యాంకు వద్ద ఆగి ఉన్న కారును తనిఖీ చేసేందుకు పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు. ఈ విషయం గమనించి దొంగలు వెంటనే పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

07/30/2016 - 12:02

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు విద్యార్థులకు పేపర్ విక్రయించిన రామకృష్ణ అనే బ్రోకర్‌ను తెలంగాణ సిఐడి పోలీసులు పంజాబ్‌లో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. మరికొంత మంది కీలక నిందితుల కోసం ముంబయి, భువనేశ్వర్ నగరాల్లో సిఐడి బృందాలు గాలిస్తున్నాయి.

Pages