S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 06:12

కడప,(టౌన్)జూలై 25: మున్సిపాల్టీల పరిధిలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పూర్తికావాలని మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కడప నగర పాలక కమిషనర్ ఛాంబర్‌లో సోమవారం జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.

07/26/2016 - 06:11

జిల్లాలోని వినియోగదారులకు స్వచ్ఛమైన సేవలు అందించడమే తమ ధ్యేయమని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ కడప జిల్లా రిజిస్ట్రార్ గోపిశెట్టి ప్రసాద్ తెలిపారు. వినియోగదారులు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ సేవలు వినియోగించుకుని తమ పనులు చక్కదిద్దుకోవాలని ఆయన తెలిపారు.

07/26/2016 - 06:10

కడప,(కలెక్టరేట్)జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రైటర్స్ వ్యవస్థను నిర్మూలించి వినియోగదారులే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి పనులను చక్కబెట్టేందుకు ఆన్‌లైన్ సేవలు ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వారా వినియోగదారులు తమ రిజిస్ట్రేషన్లను రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటును కల్పించింది.

07/26/2016 - 06:09

రాయచోటి, జూలై 25: రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు, చిన్నమండెం బాలికల వసతి గృహాలను తిరిగి ప్రారంభించాలని పీఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకు రవీంద్ర డిమాండ్ చేశారు.

07/26/2016 - 06:09

ఒంటిమిట్ట, జూలై 25:ఒంటిమిట్ట కోదండ రామాలయానికి బుధవారం టిటిడి ఇఓ సాంబశివరావు, చైర్మన్ చదవలవాడ కృష్ణమూర్తి విచ్చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 4 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల శంకుస్థానన కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. కల్యాణ మంటపం, 20 అదనపు గదులు, భక్తులకు ఆడిటోరియం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి.
రామయ్యను దర్శించుకున్న
ఎస్పీ రామకృష్ణ

07/26/2016 - 06:08

కొండాపురం, జూలై 25: సింహాద్రిపురం, కొండాపురం మండలాల మధ్య నిర్మించిన పైడిపాళెం రిజర్వాయర్ స్థానిక ప్రజలకు కలగానే మిగిలిపోయింది. సుమారు రూ.712 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఇప్పటికి సుమారు 98శాతానికిపైగా ప్రాజెక్టు పనులు పూర్తిచేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పిబిసికి నీరందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కింద సుమారు 47,500 ఎకరాలను ఆయకట్టుగా స్థిరీకరించారు.

07/26/2016 - 06:07

కడప,జూలై 25: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం డంప్‌ల కోసం టాస్క్ఫోర్స్, జిల్లా పోలీసులు గురిపెట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే చిత్తూరు, నెల్లూరు సరిహద్దు జిల్లాల్లో పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా వెతుకులాట ప్రారంభించారు.

07/26/2016 - 06:06

కడప,జూలై 25: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నూతన రాష్ట్రంలో జిల్లాల వారీగా ఇన్‌చార్జిలను ప్రకటించారు. కడప జిల్లాకు రాష్టమ్రాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కాసు వెంకటకృష్ణారెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెంచల్ బాబు యాదవ్‌లను నియామకం చేశారు.

07/26/2016 - 06:03

బత్తలపల్లి, జూలై 25: అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై తంబాపురం క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడిమర్రి మండలం మోదుగులకుంటకు చెందిన నాగరాజు గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో అనంతపురం వస్తూ జాతీయ రహదారిపె కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108సిబ్బంది అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

07/26/2016 - 06:02

ఓబుళదేవరచెరువు, జూలై 25: మండల కేంద్రంలోని ఫకృద్దీన్ విజ్ఞాన్ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థి రాకేష్‌రెడ్డి గత నాలుగు రోజుల నుండి కన్పించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బయపరెడ్డి, లక్ష్మీలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.

Pages