S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శేషాచలం అడవుల్లో ముమ్మర గాలింపులు..

కడప,జూలై 25: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం డంప్‌ల కోసం టాస్క్ఫోర్స్, జిల్లా పోలీసులు గురిపెట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే చిత్తూరు, నెల్లూరు సరిహద్దు జిల్లాల్లో పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా వెతుకులాట ప్రారంభించారు. ఆదివారం ఎర్రచందనం డంప్‌ల గాలింపుకోసం సివిల్‌పోలీసులు, ఫారెస్టు అధికారులు, పోలీసు అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా వందలాది మంది ఎర్రకూలీలు, స్మగ్లర్లు బరితెగించి మారణాయుధాలతో పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై దాడులు చేశారు. పోలీసులు కూడా ఆత్మరక్షణలోపడి గాలిలో కాల్పులు చేశారు. ఇరువర్గాల భీకర పోరులో వందలాది మంది ఎర్రకూలీలు, కొంతమంది స్మగ్లర్లు తప్పించుకోవడంతో టాస్క్ఫోర్స్, పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గత కొంతకాలంగా స్మగ్లర్లు, కూలీలు ముందస్తు జాగ్రత్తగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసుకుని డంప్‌లలో పెద్ద ఎత్తున దాచిపెట్టారు. స్మగ్లర్లు, ఎర్రకూలీలు తమకు అనువైన ప్రాంతాల్లో డంప్‌లలో ఉన్న ఎర్రచందనం దుంగలను గుట్టుచప్పుడు లేకుండా తరలించుకుపోతున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి బేస్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నా ఎర్రచందనం స్మగ్లర్లు, ఎర్రకూలీలు యథేచ్చగా అడవుల్లోకి చొరబడి డంప్‌ల్లో భద్రపరచిన దుంగులు గుట్టుచప్పుడు లేకుండా తరలించుకుపోతున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని కెవి పల్లి, ఎర్రవారిపాలెం, చంద్రగిరి, మంగాపురం, రేణిగుంట ప్రాంతాల నుంచి ఎర్రకూలీలు వివిధ వేషాలలో అడవుల్లోకి చొరబడి అప్పటికే మారణాయుధాలు సిద్ధంచేసుకుని ఉంటున్న కూలీలతో ఎర్రచందనం దుంగలను కావాల్సిన సైజుల్లో కత్తిరించుకుని బయలుదేరుతున్నారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఎర్రచందనం డాన్‌లు ఎర్రచందనాన్ని హైజాక్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే పోలీసులు డంప్‌లపై దృష్టిసారించి డంప్‌లను ఖాళీ చేయించి గోడౌన్లకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎర్రకూలీలు ఆలోచించి అడుగులు వేస్తూ డంప్‌ల వద్దకు నేరుగా చేరుకుని, చావో రేవో అంటూ ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లు యథచ్చగా తరలిస్తున్నారు. మొత్తంమీద డంప్‌లలో దాచివున్న ఎర్రచందనం స్వాధీనం దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.