S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 05:20

అనంతపురం, జూలై 25: సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పాతాళానికి చేరుకుంటోంది. ఏటా జూన్ నుంచి మే (వచ్చే ఏడాది) వరకు వాటర్ ఇయర్ (నీటి వార్షికం)గా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో 120.9 మీ.మీ. సాధారణ వర్షపాతం నమోదైంది. తద్వారా 81.6 టి ఎంసిల వర్షం నీరు లభ్యమైనట్లు జిల్లా భూగర్భ జల శాఖ నిర్ధారించింది.

07/26/2016 - 05:19

హైదరాబాద్, జూలై 25: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల వల్ల వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తెలిపారు.

07/26/2016 - 05:19

అనంతపురం, జూలై 25:వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో తోటి రైతుల వేరుశెనగ పంటను కాపాడేందుకు సమీపంలోని ఫారంపాండ్స్ నుంచి రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులను అందించడానికి నీటిని దానం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 65 వేల మంది రైతులు అంగీకరించారని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.

07/26/2016 - 05:15

విజయవాడ, జూలై 25: మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సమీకరించడానికి ప్రభుత్వం 185 జిఓను జారీ చేసింది. దీన్ని సోమవారం గెజిట్‌లో ప్రచురించింది. రాజధాని అమరావతికి సుమారు 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సునాయాసంగా సేకరించింది. ఇదే తరహాలో మచిలీపట్నం పోర్టు, కారిడార్‌కు భూమిని సమీకరించాలని భావిస్తోంది. కానీ అమరావతిలో భూసమీకరణకు, మచిలీపట్నంలో భూసమీకరణకు చాలా తేడా ఉంది.

07/26/2016 - 05:15

గుంటూరు (కొత్తపేట), జూలై 25: ఆంధ్రప్రదేశ్ రాష్టర్రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి ప్రాంతీయ అధికారి కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఎంక్వైరీ అండ్ స్క్వాడ్ కార్యాలయాన్ని ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ప్రతి బస్సును ఎక్కి త్వరితగతిన బస్సులు తనిఖీచేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్క్వాడ్ సిబ్బంది చూడాలన్నారు.

07/26/2016 - 05:14

గుంటూరు (కొత్తపేట), జూలై 25: రాష్ట్రప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరి దరిచేర్చేలా కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు కోరారు.

07/26/2016 - 05:13

గుంటూరు (కొత్తపేట), జూలై 25: రాష్ట్రప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీల కోసం స్థలం కేటాయింపుల విషయంలో విధివిధానాలు రూపొందిస్తుందని, తదనుగుణంగానే స్థలాలు కేటాయించడం జరుగుతుందని, దీనిపై వైసిపి అనవసర రాద్ధాంతాలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.

07/26/2016 - 05:12

గుంటూరు, జూలై 25: హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఈనెల 29వ తేదీన రాష్టవ్య్రాప్తంగా కోటి మొ క్కలు నాటడం ద్వారా వనం-మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ పేర్కొన్నారు. సో మవారం ఆయన హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో 13 జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు.

07/26/2016 - 05:12

ముంబయి, జూలై 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 292.10 పాయింట్లు పెరిగి 28,095.34 వద్ద స్థిరపడగా, ఆగస్టు 10 నుంచి చూస్తే ఇది గరిష్ఠ స్థాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 94.45 పాయింట్లు ఎగిసి 8,635.65 వద్ద నిలిచి 15 నెలల గరిష్ఠాన్ని తాకింది.

07/26/2016 - 05:11

విశాఖపట్నం, జూలై 25: హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ తమ తొలి బొగ్గు ఆధారిత ప్రాజెక్టును సోమవారం ప్రారంభించింది. హిందు జా గ్రూప్‌లో భాగమైన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ సంస్థ (హెచ్‌ఎన్‌పిసిఎల్) విశాఖలోని తమ 1,040 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు వెల్లడించింది. 520 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు సంస్థ వివరించింది.

Pages