S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 05:10

గుంటూరు, జూలై 25: పెదకాకాని బాజీబాబా దర్గా వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.. దర్గా ప్రాంగణంలో అన్యమత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభియోగంతో భక్తులు, స్థానికంగా నీటిపారుదలశాఖ స్థలాల ఆక్రమణదారుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. గత కొద్ది నెలల క్రితం వరకు దర్గాను వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోలేదు.

07/26/2016 - 05:10

గుంటూరు, జూలై 25: కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు విడుదల చేసింది. రెండు జిల్లాల్లో వందల కోట్ల రూపాయలకు టెండర్లు పెట్టారు. గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. పుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటికీ ఘాట్ల నిర్మాణం.. రోడ్ల విస్తరణ పనులు ఇంకా పూర్తికాలేదు. తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి సీతానగరం వరకు ఒకే ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

07/26/2016 - 04:57

న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు సోమవారం రాజ్యసభను స్తంభింపజేశారు. సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడింది. ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరగకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్ శర్మ, సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపించారు.

07/26/2016 - 04:56

న్యూఢిల్లీ, జూలై 25: భారత్-పాకిస్తాన్‌ల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఓ అనూహ్య పరిణామాలకు దారితీసింది. పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న దౌత్యవేత్తలు, ఇతర అధికారుల పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తమ పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించాలని పేర్కొంది.

07/26/2016 - 04:56

ఏలూరు, జూలై 25 : ఆస్తి తగాదా కేసులు కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలే తప్ప మీ-కోసం కార్యక్రమంలో పరిష్కరించడం కుదరదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు కావాలంటూ ఎవరూ మీ-కోసంలో దరఖాస్తులు చేయవద్దని పేర్కొన్నారు.

07/26/2016 - 04:55

ఏలూరు, జూలై 25 : దశల వారీగా కొల్లేరు ప్రాంతాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం ఏలూరు మండలం పత్తికోళ్ల లంక గ్రామంలో సోలార్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కొల్లేరు ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస వౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.

07/26/2016 - 04:54

ఏలూరు, జూలై 25 : ఉపాధి హామీ పధకంలో జిల్లాలో మంజూరు కాబడిన మరుగుదొడ్లు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపిడివో, తహసీల్దార్లను కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, ఎండివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమీక్షించారు.

07/26/2016 - 04:53

కుకునూరు, జూలై 25 : మండలంలో పోలవరం నిర్వాసిత స్పష్టత కోసం సోషల్ ఎకనామిక్ సర్వే నిర్వహిస్తున్నట్లు, దీనిలో భాగంగానే సోమవారం దాచారం, కొండపల్లి, క్షీరవల్లి, అమరవల్లి, కోమట్లగూడెం గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ సర్వే నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు.

07/26/2016 - 04:53

బదోహి, జూలై 25: ఉత్తరప్రదేశ్‌లో ఒక స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది పిల్లలు దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. ఎలాంటి కాపలా లేని లెవెల్ క్రాసింగ్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. రైలు వేగంగా వస్తున్నా దాన్ని ఎంతమాత్రం గమనించకుండా క్రాసింగ్‌కు దాటేందుకు స్కూలు బస్సు డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరప్రమాదం జరిగింది.

07/26/2016 - 04:52

తాడేపల్లిగూడెం, జులై 25: జిల్లాలో నడిబొడ్డు నుండి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయి. రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే మంత్రులు దృష్టికి ప్రజాప్రతినిధులు అనేకసార్లు మొర పెట్టుకున్నా నిధుల మంజూరులోకానీ, పనుల వేగవంతంలోగానీ ఎలాంటి పురోగతి కనపడటంలేదు.

Pages