S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 06:59

శ్రీకాకుళం(టౌన్), జూలై 25: జిల్లా ఫిర్యాదుల విభాగం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చే ప్రజా వినతులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో బాగంగా ఫోన్‌లో ఆయన వినతులు స్వీకరించారు.

07/26/2016 - 06:59

శ్రీకాకుళం(టౌన్), జూలై 25: నగరంలోని జెడ్పీ ఎదురుగా ఉన్న ఎస్సీ బాలికల వసతిగృహం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, కనీసం మంచినీటి సదుపాయం లేదని సుమారు డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న 50 మంది బాలికలు జిల్లా పిర్యాదుల విభాగంలో వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ ఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు వినతులు స్వీకరించారు.

07/26/2016 - 06:57

ఎచ్చెర్ల, జూలై 25: వసతిగృహాల్లో ఉంటూ పీజి కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కార్డులు జారీ చేస్తున్నామని, వీటిలో రోజువారీగా అల్పాహారం, భోజనం వివరాలను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని అంబేద్కర్ వర్శిటీ ఇంచార్జ్ వీసి ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు.

07/26/2016 - 06:57

సీతంపేట, జూలై 25: సీతంపేట కేంద్రంలో వచ్చే నెల 9వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించనున్నట్టు ఐటిడిఎ పిఒ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. స్థానిక పిఎం ఆర్‌సి కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ గతంలో తన ఆధ్వర్యంలో గిరిజన ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతం చేశామన్నారు.

07/26/2016 - 06:49

శ్రీకాకుళం, జూలై 25: రాష్ట్ర విభజన తర్వాత చట్టంలో జిల్లాకు పది ప్రాజెక్టులు రావల్సివుందంటూ విభజన సమయంలో అధికారంలో గల కాంగ్రెస్ ప్రభుత్వం, వేర్పాటైన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం ప్రభుత్వం సిక్కోల్ ప్రజలను మభ్యపెడుతున్నాయి.

07/26/2016 - 06:47

శ్రీకాకుళం, జూలై 25: వాతావరణం సమతుల్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా మొక్కలు నాటేకార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కార్మికశాఖామంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 29న వనమహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం కాగాలదని ఆశాభావం వ్యక్తంచేశారు.

07/26/2016 - 06:46

విజయనగరం(టౌన్), జూలై 25: విజయవాడ పరిసరాలలో 36 పురాతన దేవాలయాలను ఇటీవల తొలగించిన అధికారులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దా మధు ఆవేదన వ్యక్తం చేసారు.

07/26/2016 - 06:45

విజయనగరం(టౌన్), జూలై 25 : ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. గడపగడపకు పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 12వ వార్డు, మండలంలోని గుంకలాం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా బ్యాలెట్‌ను ప్రజలకు అందజేసారు.

07/26/2016 - 06:45

విజయనగరం(టౌన్),జూలై 25: అక్రమంగా మూసివేసిన సాహువాలా సిలెండర్ పరిశ్రమను వంటను తెరిపించేందుకు జిల్లా యంత్రాంగం జోక్యంచేసుకోవాలని కోరుతూ సి ఐ టి యు జిల్లాకార్యదర్శి టివిరమణ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.

07/26/2016 - 06:44

నెల్లిమర్ల, జూలై 25: ప్రజా సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పా లక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. మండలంలోని బుచ్చన్నపేట, పె ద్దతరిపి గ్రామాలలో సోమవారం గడపగడపకూ వైకాపా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంబశివరా జు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలలో టిడిపి ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.

Pages