S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 05:58

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో పోగొట్టుకున్న బలాన్ని తిరిగి సాధించే ప్రయత్నాల్లో తెలుగుదేశం మునిగింది. దానికోసం ప్రభుత్వంపై పోరాట కార్యక్రమాలకు పదును పెడుతోంది. ప్రతి శనివారం పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ అవుతున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ప్రజాసమస్యలపై దృష్టి సారించే కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా వేసిన పది కమిటీలు పది ముఖ్యమైన సమస్యలను గుర్తించాయి.

07/26/2016 - 05:57

హైదరాబాద్, జూలై 25 : కొత్త విసిలు వీరే
పి.సాంబయ్య
తెలంగాణ యూనివర్శిటీ
వి. ప్రవీణ్‌కుమార్
జయశంకర్ అగ్రికల్చరల్

బి. రాజారత్నం
పాలమూరు యూనివర్శిటీ

ఎస్. రామచంద్ర
ఉస్మానియా యూనివర్శిటీ
సాయన్న
కాకతీయ యూనివర్శిటీ

సీతారామారావు
బి.ఆర్. అంబేద్కర్ వర్శిటీ

07/26/2016 - 05:56

హైదరాబాద్, జూలై 25 : తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దళితులు ముందుకు వస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి టి-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇన్‌క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్యూనర్స్) పేరు పెట్టారు. దళితులకు ప్రోత్సాహకాలు అందించేందుకు వీలుగా సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

07/26/2016 - 05:55

హైదరాబాద్, జూలై 25 : తెలగాణ రాష్ట్రంలోని ఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ రాయితీని కొనసాగించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు చైర్మన్‌గా ఏర్పాటైన ఐదుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం పలుదఫాలుగా సమావేశమై ఈ అంశంపై సమీక్షించింది. ఉపసంఘంలో వాణిజ్యపన్నులు, పంచాయితీరాజ్, విద్యుత్తు, ఆర్థిక శాఖల మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

07/26/2016 - 05:54

హైదరాబాద్, జూలై 25: ఇందిరా క్రాంతి పథం (ఐకెపి) సిబ్బందికి వేతనాలు (పారితోషకం) పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐకెపి సిబ్బందికి పారితోషకాన్ని పెంచే ప్రతిపాదనను పంపించాలని సిఎం కెసిఆర్ సోమవారం ఆదేశించారు. తమ సర్వీసులను కూడా కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా క్రమబద్ధీకరించాలని ఐకెపి సిబ్బంది ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

07/26/2016 - 05:54

హైదరాబాద్, జూలై 25: విద్యార్థుల సమస్యలపై ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్ తెలిపారు.

07/26/2016 - 05:48

న్యూఢిల్లీ, జూలై 25: రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అడ్డుకుంటూ అతని భవిష్యత్తును దెబ్బతీస్తున్న డోపింగ్ కుంభకోణం సోమవారం సరికొత్త మలుపు తిరిగింది.

07/26/2016 - 05:44

న్యూఢిల్లీ, జూలై 25: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను డోపింగ్ కుంభకోణం చుట్టుముట్టడం ‘దురదృష్టకరమని’ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అతని సహచర రెజ్లర్ సుశీల్ కుమార్ సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు. సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన విషయం విదితమే.

07/26/2016 - 05:41

న్యూఢిల్లీ, జూలై 25: డోపింగ్ వ్యవహారంలో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందన్న అనుమానాలు క్రమేణా బలపడుతున్నాయి.

07/26/2016 - 05:39

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 25: కరీబియన్ దీవుల్లో ప్రారంభమైన నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో టీమిండియా అద్భుతమైన శుభారంభాన్ని అందుకుంది. నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో సోమవారం తెల్లవారు జామున (్భరత కాలమానం ప్రకారం) ఆతిథ్య వెస్టిండీస్ జట్టును ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో మట్టికరిపించి నాలుగు రోజులకే ఘన విజయాన్ని సాధించింది.

Pages