S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 03:10

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 25: హరితాంధ్రప్రదేశే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన వనం-మనం ఉద్యమంలో స్ఫూర్తిని నింపుతూ విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుండి అధికారులు, ప్రజాప్రతినిధులతో నీరు-చెట్టు కార్యక్రమంపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/26/2016 - 03:10

నల్లగొండ టౌన్, జూలై 25: అధిక ఫీజులను ప్రభుత్వ అరికట్టాలని, కెజి టూ పిజి ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఎబివిపి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రం తరగతులను బహిష్కరించి గడియారం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో గడియారం సెంటర్ చౌరస్తాలో బైఠాయించి అధిక ఫీజుల వసూళ్లకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

07/26/2016 - 03:10

న్యూఢిల్లీ, జూలై 25: గర్భస్రావం చట్టంలోని ఒక నిబంధన ప్రకారం ఒక అత్యాచార బాధితురాలు సరిగా ఎదగని తన 24 వారాల గర్భస్థ పిండాన్ని తొలగించుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. గర్భాన్ని కొనసాగించుకోవడం వల్ల తల్లికి శారీరకంగా, మానసికంగా ముప్పు పొంచి ఉన్నదనే కారణంతో అత్యున్నత న్యాయస్థానం మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971లోని సెక్షన్ 5 ప్రకారం ఈ అనుమతి ఇచ్చింది.

07/26/2016 - 03:05

గజ్వేల్, జగదేవ్‌పూర్, జూలై 25 : పోలీసుల లాఠీ చార్జీలో గాయపడి గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ ఐకాస చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాంను వంటిమామిడి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు: ఇఎన్‌సి

07/26/2016 - 03:04

గజ్వేల్, జగదేవ్‌పూర్, జూలై 25 : ప్రజల హక్కులను టిఅర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తుందని తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. సోమవారం మల్లన్నసాగర్ భూబాదితులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద పోలీసుల అరెస్ట్ చేసి జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

07/26/2016 - 03:04

జీడిమెట్ల, జూలై 25: మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు.

07/26/2016 - 03:04

జిన్నారం, జులై 25: ముంపుగ్రామాల బాధితులతో చర్చించి ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని వెతకాలని జెఎసి చైర్మెన్ కోదండరామ్ అన్నారు. మల్లన్నసాగర్ బాధితుల పరామర్శకు వెళ్ళుతున్న కోదండరామ్‌ను మెదక్ జిల్లా ములుగులో పోలీసులు అరెస్టు చేశారు. ఇక తూప్రాన్‌లో డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

07/26/2016 - 03:03

సిద్దిపేట, జూలై 25: మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరపడం సిగ్గుచేటని, వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నంప్రభాకర్ డిమాండ్ చేశారు. గతంలో రైతులపై కాల్పులు జరిపిన చంద్రబాబుకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుందన్నారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/26/2016 - 03:00

హైదరాబాద్, జూలై 25: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పేషీనుంచి ఏ ఉన్నతాధికారి చాంబరు చూసినా ఒకటే హడావిడి.. సమీక్షలు.. తనిఖీలు.. సందర్శనలు.. డెమోలు.. ఇవన్నీ కృష్ణా పుష్కరాల కోసం జరుగుతున్న హడావిడే! గోదావరి పుష్కరాల సందర్భంగా రెండు డజన్ల మంది తొక్కిసలాటలో మృతి చెందిన నేపథ్యంలో, బాబు ప్రభుత్వం విమర్శలకు గురయింది. బాధ్యతారాహిత్యంవల్లే తొక్కిసలాట జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

07/26/2016 - 03:00

గజ్వేల్, జగదేవ్‌పూర్, జూలై 25 : మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు నిరసనగా అఖిలపక్షం ఇచ్చిన జిల్లా బంద్ పిలుపుమేరకు గజ్వేల్‌లో సోమవారం బంద్ విజయవంతమైంది. గజ్వేల్ పట్టణంతోపాటు నియోజకవర్గ పరిదిలోని వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక, గజ్వేల్ మండలాల పరిధిలో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి.

Pages