S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 03:59

హైదరాబాద్, జూలై 25: మహానగరం పరిధిలో ఎంత చిన్న ఇళ్లయినా, బడా షాపింగ్ మాల్ అయినా నిర్మించే వారికి, నిర్మాణానికి సంబంధించిన నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన శిబిరాలను నిర్వహించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు.

07/26/2016 - 03:57

హైదరాబాద్, జూలై 25: మహానగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట వేసేందుకు ఇప్పటికే ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇకపై మొక్కలు నాటి ఉన్న స్థలాల్లోనే నిర్మాణ అనుమతులివ్వాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

07/26/2016 - 03:55

విజయవాడ, జూలై 25: తెలంగాణ రాష్ట్రంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకున్న నిర్వాసితులపై ప్రభుత్వం నిరంకుశంగా దాడులకు పాల్పడటం అన్యాయమని, ఈ దాడుల్లో 28 మంది తీవ్రంగా గాయపడగా, ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన ప్రజల్ని అదుపు చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.

07/26/2016 - 03:55

తిరుమల, జూలై 25: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడలో టిటిడి ఏర్పాటుచేస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నాలుగంచెల విధానంతో దర్శనం కల్పించనున్నట్లు తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు. కృష్ణాపుష్కరాల్లో టిటిడి చేపడుతున్న ఏర్పాట్లకు సంబంధించి ఆయన తిరుమలలో అన్నదానం, ఆరోగ్యవిభాగం, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

07/26/2016 - 03:54

వేములవాడ, జూలై 25: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వెనకభాగంలోని చెట్ల పోదలలో సోమవారం ఉదయం హత్యకు గురైన ఒక యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వేములవాడ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ ప్రదేశంలో గుర్తు తెలియని యువతి మృతదేహం పడిఉందనే సమాచారంతో సంఘటనా స్థలానికి వెల్లి సదరు యువతి మృతదేహాన్ని పరిశీలించామన్నారు.

07/26/2016 - 03:52

పరకాల, జూలై 25: వృక్షాలతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. సోమవారం పరకాల మండలం నడికూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరకాల పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరతహారం కార్యక్రమంలో రూరల్ ఎస్పీ మొక్కలు నాటారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వరంగల్ రూరల్ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మొక్కలు నాటామని చెప్పారు.

07/26/2016 - 03:51

విజయవాడ, జూలై 25: పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన వైద్య పరికరాలతో పాటు మొబైల్ బృందాలు, అంబులెన్స్ సౌకర్యం, ఘాట్లలో భక్తులకు సూచనలను చేసే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. వైద్య సిబ్బందికి బ్లూస్కర్టు, వైట్ స్కార్ప్‌తో ప్రత్యేకమైన డ్రెస్‌కోడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

07/26/2016 - 03:51

ఆత్మకూరు, జూలై 25: పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసి భావితరం నేతలుగా ఎదగాలని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.

07/26/2016 - 03:50

మానవపాడు, జూలై 25: కర్నూల్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూల్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం తమ అల్లుడిని దుబాయి పంపించాలని ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లి విమానం ఎక్కించి కారులో సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు-జల్లాపురం స్టేజీల మధ్యలో ముందుగా వెళ్తున్న లారీని వెనుకనుంచి వారి వాహనాన్ని ఢీకొంది.

07/26/2016 - 03:50

నరుూంనగర్, జూలై 25: నేటి మొక్కలే భవిష్యత్తుతరాలకు వృక్షాలుగా మారి భరోసాగా నిలుస్తాయని పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా పద్మాక్షమ్మగుట్ట ప్రాంతంలోని జయ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం కళాశాలకు చెందిన విద్యార్ధులు పోలీసుల సహకారంతో 500 మొక్కలను కళాశాల ప్రాంగణంలో నాటారు.

Pages