S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 02:58

జహీరాబాద్, జూలై 25: హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలని రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. స్థానిక ఆర్టీఎ కార్యాలయంలో ఎంవిఐ గణేష్ అధ్యక్షతన నిర్వహించిన హరిత హారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో పౌరులు ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నారన్నారు.

07/26/2016 - 02:57

సిద్దిపేట, జూలై 25 : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీ, కాల్పులు జరిగినందుకు నిరసగా అఖిలపక్షం పిలుపు మేరకు సిద్దిపేటలో నిర్వహించిన బంద్ పాక్షిక ప్రభావం చూపింది.

07/26/2016 - 02:56

సంగారెడ్డి టౌన్, జూలై 25: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్‌ని నిరసిస్తూ అఖిల పక్షాలు సోమవారం ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. కాంగ్రెస్, బిజేపి, సిపిఎం, సిపిఐ నాయకులు ఉదయం 4గంటలకే సంగారెడ్డి బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాయి.

07/26/2016 - 02:55

సిద్దిపేట, జూలై 25: మల్లన్నసాగర్ నిర్వాసితుల పై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా అఖిలపక్షం బంద్ సందర్భంగా సిద్దిపేటకు వచ్చిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ను కొత్తబస్టాండ్ వద్ద వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

07/26/2016 - 02:52

నెల్లూరు, జూలై 25: ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్లు ఇసుక విధానాన్ని మార్చి ఉచితం చేసినా అక్రమ రవాణా ఆగడం లేదు. కొంత మంది ఇసుక అక్రమ రవాణా వ్యాపారం చేసుకొని కాసులు పిండుతున్నారు. నెల్లూరు జిల్లా చెన్నై రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో పెద్దఎత్తున ఇసుక తరలిపోతోంది. అక్రమ రవాణాపై సరిహద్దులో తనిఖీ లేకుండాపోయింది. పర్యావరణ అనుమతి లేని ఇసుక రేవులో సైతం అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి.

07/26/2016 - 02:50

కర్నూలు, జూలై 25: శ్రీశైలం జలాశయం నీటి మట్టం సోమవారం 800 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 31 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 29.01 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాలలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 802 అడుగులు ఉండగా, 30.23 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

07/26/2016 - 02:47

వేపగుంట/గోపాలపట్నం, జూలై 25: దైవాన్ని నమ్ముకొని ధైర్యంగా ఉండాలని వాయుసేన విమాన ప్రమాద కుటుంబాలకు వైకాపా అధినేత జగన్ ధైర్యం చెప్పారు. సోమవారం వేపగుంట, అప్పన్నపాలెం ప్రాంతాల్లోని గంట్ల శ్రీనివాస్, బి. సాంబమూర్తి కుటుంబాలను పరామర్శించారు. బాధితులు మనోవేదనతో జగన్ ముందు విలపించారు.

07/26/2016 - 02:42

విజయవాడ, జూలై 25: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన పనులు ఊపందుకున్నాయి. నిన్నమొన్నటి వరకూ మొండి గోడలతో కనిపించిన సెక్రటేరియట్ ఇప్పుడు కొత్త లుక్కుతో కనిపిస్తోంది. కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని తలపించేలా ఉంది. సెక్రటేరియట్‌లో ఇంటీరియల్ డెకరేషన్ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఫ్లోరింగ్ పని కూడా చాలావరకూ పూర్తయింది.

07/26/2016 - 02:34

విశాఖపట్నం, జూలై 25: రాష్ట్రంలో నైరుతి రుతుపనాలు చుర్గుగా ఉన్నాయి. దీనికి తోడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురియవచ్చని తెలిపారు.

07/26/2016 - 02:33

విజయవాడ, జూలై 25: పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన వైద్య పరికరాలతో పాటు మొబైల్ బృందాలు, అంబులెన్స్ సౌకర్యం, ఘాట్లలో భక్తులకు సూచనలను చేసే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. వైద్య సిబ్బందికి బ్లూస్కర్టు, వైట్ స్కార్ప్‌తో ప్రత్యేకమైన డ్రెస్‌కోడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Pages