S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 04:11

హైదరాబాద్, జూలై 25: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలకు మేరుగైన సేవలు అందించేందుకు జలలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. వినియోగదారులకు సక్రమమైన నీటి సరఫరా, డ్రైనేజీ, లోవాటర్ సప్లై వంటి సమస్యలతో పాటు సకాలంలో నీటి బిల్లుల జారీ, అక్రమ నీటి కనెక్షన్లను గుర్తించడం, కమర్షియల్ నీటి కనెక్షన్ల సంఖ్యను పెంచేందుకు జలమండలి వినూత్న తరహాలో నూతర నిర్ణయాలు తీసుకుంటుంది.

07/26/2016 - 04:10

హైదరాబాద్, జూలై 25:రాజధాని నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో యూనిట్ ధర మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ఎత్తు విషయంలోనూ నిబంధనలు మార్చనున్నారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సోమవారం కలిసి చర్చించారు.

07/26/2016 - 04:09

హైదరాబాద్, జూలై 25 : విద్యారంగంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎబివిపి సోమవారం విద్యాసంస్థల (కెజి టు పిజి) బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ప్రైవేట్, కార్పోరేట్ కాలేజీల ఫీజుల దోపిడీని అరికట్టి, ఫిజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

07/26/2016 - 04:08

బేగంపేట, జూలై 25: సకాలంలో వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తనకు సంతృప్తినిస్తున్నాయని సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి రంగం కార్యక్రమంలో అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా సికిందరాబాద్ బోనాల సందడి రెండోరోజు కూడా కొనసాగింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు.

07/26/2016 - 04:08

కెపిహెచ్‌బికాలనీ, జూలై 25: తాగిన మైకంలో హత్య చేయడమే కాకుండా ప్రమాదకరంగా చిత్రీకరించి పోలీసులను పక్కదారి పట్టించిన ఐదుగురు వ్యక్తులను కెపిహెచ్‌బి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో టిఆర్‌ఎస్ నాయకుడు ఉన్నాడు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

07/26/2016 - 04:07

హైదరాబాద్, జూలై 25: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ కార్మికులకు సకాలంలో పదోన్నతులు కల్పించి, రోస్టర్ విదానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని జలమండలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలు వినతులతో కూడిన వినతి పత్రాన్ని సంఘం ప్రతినిధులు జలమండలి పిఆండ్‌ఎ విభాగం డైరెక్టర్ అజ్మీరాకృష్ణకు వినతి పత్రం సపర్పించారు.

07/26/2016 - 04:06

ఖైరతాబాద్, జూలై 25: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుతో తాము సక్రమంగా పనులు చేయలేక పోతున్నామని జిహెచ్‌ఎంసి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సెంట్రల్ జోన్ కార్యాలయంలో అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు.

07/26/2016 - 04:04

హైదరాబాద్, జూలై 25: తెల్లవారే కల్లా నగరంలోని అన్ని రహదార్లను పరిశుభ్రపరిచే స్వీపర్లకు కనీసం వసతులు కల్పించాలని తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు సి. సతీష్‌కుమార్ అధికారులను కోరారు. అంతేగాక, చెత్తాచెదారంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, కొబ్బరి నూనె, బూట్లు వంటివి వెంటనే ఇవ్వాలని కోరారు.

07/26/2016 - 04:03

జీడిమెట్ల, జూలై 25: మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు.

07/26/2016 - 04:01

కరీంనగర్ టౌన్, జూలై 25: తరాల తరబడి తాము భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఎవుసం చేసుకుంటూ వచ్చిన ఆదాయంతోనే జీవనం కొనసాగిస్తున్నాం..మెట్ట ప్రజలకోసం తమ గ్రామాల్లోప్రాజెక్టులు కడుతున్నామంటే సంతోషించాం...నీటినిల్వ కోసం భూమి కావాలంటే సాగులేకున్నా సరే తోటి రైతులకే లాభం కల్గుతుందనే భావనతోభూములిచ్చాం. ఇచ్చిన కాడికే పరిహారం తీసుకున్నాం.

Pages