S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 00:53

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో శామ్‌సంగ్ అకాడమీ ఏర్పాటు చేనున్నట్టు ఐటి మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ -శామ్‌సంగ్ ఆధ్వర్యంలో ఈ టైజన్ (అపరేటింగ్ సాఫ్ట్‌వేర్) అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అకాడమీ ద్వారా శామ్‌సంగ్ కోసం యాప్స్‌తోపాటు ఇతర సేవల యాప్స్ తయారు చేయనున్నట్టు చెప్పారు.

07/26/2016 - 00:51

హైదరాబాద్, జూన్ 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు డిజైన్ రూపొందించకముందే బలవంతపు భూసేకరణకు ప్రయత్నించటం ఎంతవరకు సమంజసమని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎన్నిసార్లు అయనా జెలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్భ్రావృద్ధిలో ప్రజా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.

07/26/2016 - 00:50

సంగారెడ్డి, జూలై 25: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా పరిణమించింది. ఆదివారం నాటి లాఠీచార్జీ ఘటనకు నిరసనగా అఖిలపక్షం, ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మెదక్ జిల్లా బంద్ సోమవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సంపూర్ణంగా ముగిసింది. ముంపు గ్రామాలున్న గజ్వేల్ సెగ్మెంట్ పోలీసుల అష్టదిగ్బంధనంలో బందీ అయింది.

07/26/2016 - 00:43

న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలెత్తిన కృష్ణా జలాల వివాదంలో జోక్యం చేసుకోబోనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు.

07/26/2016 - 00:42

విజయవాడ, జూలై 25: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మలేసియా ఆర్కిటెక్ట్‌లు తాజా నమూనాలతో ముందుకొచ్చారు. మలేసియాకు చెందిన ఆర్డీఏ హారిస్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని భవనాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను సమర్పించారు. భవనాల ఆకృతులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు.

07/26/2016 - 00:39

హైదరాబాద్, జూలై 25: వర్శిటీ వీసీల నియామకానికి సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే తెలంగాణలోని పలు వర్శిటీలకు వీసీలను నియమించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వం తీరుపట్ల సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.

07/26/2016 - 00:37

తిరుమల, జూలై 25:తిరుమల కాలిబాటలో కనుమ మార్గంలో కనిపిస్తూ భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చిన చిరుత పులి సోమవారంనాడు ఏకంగా ఓ అతిథిగృహంలోకే చొరబడింది. విఐపిలు బసచేసే పద్మావతి అతిథి భవనంలోని నర్శింగ్ సదన్ అతిథి గృహంలోకి సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో చొరబడిన పులి, మూడున్నర గంటలపాటు అటు భక్తుల్ని, ఇటు అధికారులను పరుగులు పెట్టించింది.

07/26/2016 - 00:35

విజయనగరం(టౌన్), జూలై 25: తన ప్రేమను నిరాకరించిన యువతిపై పట్టపగలు పదునైన కత్తితో దాడికి తెగబడ్డాడు ఓ యువకుడు. గాజులరేగ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన కలకలం రేకెత్తించింది. గాజులరేగ మెయిన్ రోడ్డులో బాధిత కుటుంబం కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తోంది. దాడిలో గాయపడిన యువతి డిగ్రీ చదువుతోంది. ఏడాది కిందట వరసకు బంధువు అయ్యే విక్రమ్ అనే యువకుడు బాధితురాలిని చూసి ప్రేమ అంటూ వెంట బడ్డాడు.

07/26/2016 - 00:31

కాకినాడ, జూలై 25: ఆకర్షణీయ నగరంగా ఎంపికై ఏడాది పూర్తిచేసుకున్న కాకినాడ నగరం త్వరలో ‘స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్’గా అప్‌గ్రేడ్ కానున్నది. దీంతో కాకినాడ నగరానికి ప్రత్యేకాధికారులు నియమితులు కానున్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని కీలక పోస్టులను కూడా మంజూరుచేసింది.

07/26/2016 - 00:15

నేపాల్ ప్రధానమంత్రి పదవికి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి రావడం చైనా అమలు జరుపుతున్న రాజకీయ వ్యూహంలో భాగం. ఖడ్గప్రసాద్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి నేపాల్ ఏకీకృత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తుండిన సమయంలోనే ఆయనను పదవిలో నిలబెట్టడానికి చైనా ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోందన్న ప్రచారం జరిగింది. ఖడ్గప్రసాద్ ప్రభుత్వాన్ని గద్దెదించడం లేదా ఆయన పదవిలో కొనసాగడం నేపాల్ అంతర్గత సమస్య.

Pages