S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 03:49

నక్కలగుట్ట, జూలై 25: మల్లన్నసాగర్ నిర్వాసితులపై, లాఠీచార్జికి నిరసనగా సోమవారం హన్మకొండలోని అశోక జంక్షన్‌లో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మెదక్ జిల్లా మల్లన్నసాగర్ నిర్వాసితులపై, లాఠీచార్జి తగదన్నారు.

07/26/2016 - 03:49

వడ్డేపల్లి, జూలై 25: గత పది రోజులుగా జెఎన్‌ఎస్ మైదానంలో నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల దేహదారుఢ్య, క్రీడాంశాల పరీక్షల నిర్వహణకు పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం అభ్యర్థులకు మైదానంలో ఎలాంటి క్రీడాంశాల పరీక్షలు జరుగకపోవడంతో విధులు నిర్వహిస్తున్న ఇన్స్‌పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లు తమ ప్రతిభను పదును పెట్టుకునే పనిలో పడ్డారు.

07/26/2016 - 03:48

పరకాల, జూలై 25: రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేసి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు.

07/26/2016 - 03:38

నక్కలగుట్ట, జూలై 25: కాకతీయ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఆర్. సాయన్న సోమవారం కెయులో బాధ్యతలు స్వీకరించారు. ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరాట్‌పల్లి గ్రామానికి చెందినవాడు. దాదాపు 26సంవత్సరాల పాటు విద్యాబోధన చేసి 1989లో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. అంతకు పూర్వం ఆయన జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకునిగా పని చేశారు.

07/26/2016 - 03:34

కంఠేశ్వర్, జూలై 25: ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని, అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాదిగలకు నమ్మకం ఏర్పడుతుందని టి.ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట టి.ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలను ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

07/26/2016 - 03:33

డిచ్‌పల్లి, జూలై 25: దర్పల్లి మండలంలో హరితహారం పథకం కింద 4లక్షల మొక్కలు నాటడం జరిగిందని అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. అయితే మండలంలోని 18గ్రామాల్లో ఒక్కో గ్రామం 20వేల మొక్కలు నాటినట్లు అధికారులు తమ నివేదికలో టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు. అధికారులు చూపిన లెక్కల ప్రకారం సుమారు 20వేల ఇజిఎస్ కూలీలు పనులు చేయాల్సి ఉంటుంది.

07/26/2016 - 03:33

నిజామాబాద్, జూలై 25: పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం అమలులో అలసత్వాన్ని కనబరుస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా కలెక్టర్ యోగితారాణా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే రెంజల్ మండలానికి చెందిన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ, ఎడపల్లి మండలానికి చెందిన పలువురికి చార్జ్ మెమోలు జారీ చేసిన విషయం విదితమే.

07/26/2016 - 03:32

డిచ్‌పల్లి రూరల్, జూలై 25: గత రెండేళ్ల కాలం నుండి ఖాళీగా ఉంటూ వచ్చిన తెలంగాణ విశ్వవిద్యాలయం ఉప కులపతి పోస్టు ఎట్టకేలకు భర్తీ అయ్యింది. తెయు వైస్ ఛాన్స్‌లర్‌గా పసుల సాంబయ్యను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం వేళలోనే సాంబయ్య డిచ్‌పల్లిలోని వర్శిటీకి చేరుకోగా, ప్రభుత్వం నుండి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయిన వెంటనే వి.సిగా లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.

07/26/2016 - 03:32

నిజామాబాద్, జూలై 25: జిల్లాలో తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కల వివరాలను ఫొటోలతో సహా పూర్తి వివరాలతో గూగుల్ యాప్ ద్వారా ఉపాధి హామీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తన చాంబర్‌లో అధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష జరిపారు.

07/26/2016 - 03:30

ఎల్లారెడ్డి, జూలై 25: మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, భావి తరాల మనుగడ మొక్కలతోనే సాధ్యమవుతోందని వ్యవసాయశాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి మండలంలోని అడివిలింగాల గ్రామ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Pages