S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 02:19

హైదరాబాద్, జూలై 25: మల్లన్నసాగర్ భగభగమంటోంది. రెండేళ్లపాటు నిర్నిరోధంగా సాగుతూవచ్చిన కెసిఆర్ పాలనకు మల్లన్నసాగర్ పెద్ద గుదిబండగా మారింది. కెసిఆర్‌పై దాడికోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు ‘మల్లన్న’ బ్రహ్మాస్త్రంగా దొరికింది. అన్ని పక్షాలు.. అసంతృప్తితో ఉన్న ప్రజాసంఘాలు, సంస్థలు, నాయకులు ఒక్కుమ్మడిగా మల్లన్నసాగర్‌ను భుజానికెత్తుకుని యుద్ధం ప్రారంభించారు.

07/26/2016 - 02:18

హైదరాబాద్, జూలై 25: వైఎస్ జగన్ సంస్థలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు తమపై అభియోగం మోపుతూ కేసును కొట్టివేయాలని ఇందు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఐ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లో వైఖరి తెలియజేయాలని సిబిఐని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు శ్యామ్ ప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

07/26/2016 - 02:17

హైదరాబాద్, జూలై 25: మనషుల అక్రమ రవాణాపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో కోర్టు ముందు ఉంచాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మనషుల అక్రమ రవాణాలో పట్టుబడిన మహిళల పునరావాసం కోసం ఏర్పాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజల్వన స్వచ్చంధ సంస్థ ప్రతినిధి సునితకృష్ణన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు సోమవారం ఆదేశించింది.

07/26/2016 - 02:06

తుళ్లూరు, జూలై 25: శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలను వెలగపూడిలోనే నిర్వహిస్తామని శాసనమండలి చైర్మన్ చక్రపాణి తెలిపారు. మంత్రి నారాయణ ఆహ్వానం మేరకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత 2వ బ్లాకు, అసెంబ్లీ కోసం ఏర్పాటు చేస్తున్న 6వ బ్లాకును పరిశీలించిన అనంతరం నిర్మాణం పూర్తయిన 5వ భవనాన్ని తిలకించారు.

07/26/2016 - 02:02

హైదరాబాద్, జూలై 25: బయటి నుంచి వచ్చిన శక్తుల కుట్ర వల్లనే మల్లన్నసాగర్ సంఘటన చోటు చేసుకుందని తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి సిపిఎం, టిడిపి పార్టీలకు చెందిన వారు వచ్చి రాళ్లు రువ్వి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేట్టు చేశారని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.

,
07/26/2016 - 01:57

హైదరాబాద్ / కాచిగూడ, జూలై 25: అమెరికాలో స్నేహితుడి చేతిలో హతమైన హైదరాబాద్‌కు చెందిన సంకీర్త్ మృతదేహం తన నివాసానికి సోమవారం చేరుకుంది. సంకీర్త్ ఇటీవల అమెరికాలో తన స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మెడిసిన్ పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని అమెరికాలోనే స్థిరపడ్డ తమ కుమారుడు హత్యకు గురికావటం అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

07/26/2016 - 01:48

హైదరాబాద్, జూలై 25: జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌క్లబ్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలస్యంగా స్పందించిన జిహెచ్‌ఎంసి అధికారులు ఎప్పటిలాగానే ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.

07/26/2016 - 00:57

కర్నూలు, జూలై 25: శ్రీశైలం జలాశయం నీటి మట్టం సోమవారం 800 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 31 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 29.01 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాలలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 802 అడుగులు ఉండగా, 30.23 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

07/26/2016 - 00:56

హైదరాబాద్, జూలై 25: అంతరాష్ట్ర భద్రతా మండలి సమావేశానికి హాజరైన సందర్భంలో సిఎం కె చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిపిన భేటీ ఫలితాలిచ్చింది. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమైన అంశాలలో దాదాపు అన్నింటిపైనా కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు రాష్ట్రానికి తీపికబురు అందింది.

07/26/2016 - 00:54

హైదరాబాద్, జూలై 25: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆగస్టు 7న రాష్ట్రానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ మేరకు పిఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. సిఎం కెసిఆర్ నిర్వహించే సుదర్శన యాగాన్ని ప్రధాని సందర్శిస్తారు.

Pages