S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

03/23/2019 - 20:22

కడప జిల్లా కొత్తపేటలో 1908 నవంబర్ 16న జన్మించారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఆడిటింగ్‌లో డిప్లొమా పొందారు. 1936 ప్రాంతాల్లో రోహిణి సంస్థ అధినేత హెచ్‌ఎం రెడ్డి తీసిన గృహలక్ష్మి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పర్యవేక్షించారు. మిత్రులు ఏకె శేఖర్, రామనాథ్, మూలా నారాయణస్వామిలతో కలిసి వాహిని పిక్చర్స్ స్థాపించి ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు రూపొందించారు.

03/16/2019 - 20:17

విజయవాడలో చదువుకున్న సిఎస్ రాజు (చింతలపాటి సన్యాసిరాజు) వినోదావారి దేవదాసు చిత్రానికి సహాయ దర్శకత్వం వహించటం ద్వారా చిత్రసీమలోకి ప్రవేశించారు. 1961లో నిర్మాతగా మారి యన్‌టి రామారావు హీరోగా ‘టాక్సీరాముడు’ చిత్రం నిర్మించారు. 1969లో యన్‌టిఆర్ హీరోగా వీరు నిర్మించిన చిత్రం -్భలే మాస్టారు. తరువాత ‘పవిత్ర హృదయాలు’, ‘రాజపుత్ర రహస్యం’ చిత్రాలు నిర్మించారు.

03/09/2019 - 23:31

పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన తోట సుబ్బారావు తొలుత బస్ సర్వీసులు నడిపేవారు. తరువాత చిత్రరంగంలోకి ప్రవేశించి నిర్మాతగా ‘దొంగను పట్టిన దొంగ’ డబ్బింగ్ చిత్రం తీశారు. శ్రీదేవి కంబైన్స్ పతాకంపై 1966లో ‘పరమానందయ్య శిష్యులకథ’, ‘67లో భువనసుందరి కథ, ‘68లో చుట్టిరికాలు సినిమాలు తీశారు. ఆక్రమంలో 1969లో వీరు నిర్మించిన చిత్రమే -భలే అబ్బాయిలు. ఈ చిత్రానికి పేకేటి శివరామ్ దర్శకులు.

03/02/2019 - 20:18

ఏఎస్‌ఆర్ ఆంజనేయులు కృష్ణా జిల్లా కోలవెన్నులో 1933 సెప్టెంబర్ 3న జన్మించారు. సినీ నిర్మాణంపై అభిరుచితో మాధవీ పతాకంపై వీరు నిర్మించిన చిత్రం ‘పాండవ వనవాసం’ ద్వారా ‘హేమమాలిని’ని తెరకు పరిచయం చేశారు. తరువాత ఆమె హిందీ చిత్రసీమలో ఖ్యాతి గడించారు. వీరు 1967లో రూపొందించిన ‘స్ర్తిజన్మ’ తరువాత 1968లో రూపొందించిన చిత్రం ‘బందిపోటు దొంగలు’.

02/23/2019 - 20:54

1931లో ఉత్తరప్రదేశ్ ఆలీఘర్ ప్రాంతంలోని ఆట్రాలి గ్రామంలో జన్మించారు రవికాంత్ నగాయిచ్. హీరో యన్‌టి రామారావు నిర్మించిన ‘సీతారామకల్యాణం’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆ తరువాత గులేబకావళి కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, వీరాభిమన్యు వంటి పలు చిత్రాలకు ట్రిక్ ఫొటోగ్రాఫర్‌గా వినుతికెక్కారు. హిందీ చిత్రసీమలోనూ పలు చిత్రాలకు పని చేసి పేరుపొందారు.

02/16/2019 - 20:41

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలోని భూస్వామి కొడాలి గోపాలకృష్ణ. తమ అభిమాన హీరో యన్‌టి రామారావు హీరోగా, జయలలిత హీరోయిన్‌గా 1969లో వీరు నిర్మించిన చిత్రం -కథానాయకుడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన బృంద గానంలోని ఓ స్టిల్‌ను తమ బ్యానర్ లోగోగా రూపొందించి ‘గోపాలకృష్ణ ప్రొడక్షన్స్’పై చిత్రాన్ని నిర్మించారు. తరువాత ‘దీర్ఘసుమంగళి’ (1974లో) నిర్మించారు.

02/09/2019 - 20:45

ప్రముఖ నిర్మాత హెచ్‌ఎం రెడ్డి తీసిన ‘నిర్దోషి’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమై, అదే నిర్మాత తీసిన జానపద చిత్రం ‘ప్రతిజ్ఞ’లో హీరోగా నటించారు తాడేపల్లి లక్ష్మీకాంతారావు (టియల్ కాంతారావు). అలా పలు జానపద, సాంఘిక, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో కథానాయకుడిగా విభిన్న పాత్రలతో మెప్పించి -జానపద హీరోగా, కత్తివీరునిగా, నారద పాత్ర పోషణలో ప్రత్యేకత ప్రదర్శించిన విలక్షణ నటుడు ఆయన.

02/02/2019 - 20:05

దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి సోదరుడు బి నాగిరెడ్డి. వీరు 1912 డిసెంబరు 2న పొట్టిపాడులో జన్మించారు. చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. 1908లో తెనాలిలో జన్మించారు. రచయితగా చక్రపాణిగా ప్రాచుర్యం పొందారు. 1944లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.

01/26/2019 - 22:39

1907 జూలైలో జన్మించారు ఏవి మొయ్యప్పన్. 1938లో ‘అల్లి అర్జున్’తో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టి 1940లో ప్రగతి స్టూడియోస్ ఆరంభించారు. 1945 నవంబర్ 14న శాంధోంలో ఏవీయం స్టూడియో ప్రారంభించి తరువాత వడపళనికి మార్చారు. 1950లో ‘జీవితం’ చిత్రం మొదలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందకిపైగా సినిమాలు నిర్మించిన సంస్థ ఏవీయం. విశిష్ట స్థానం కలిగిన ఈ సంస్థ పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించింది.

01/19/2019 - 20:54

బ్యానర్: మధు పిక్చర్స్
కళ: కృష్ణారావు
ఛాయాగ్రహణం: ఎస్ వెంకటరత్నం
కూర్పు: పి శ్రీహరిరావు
నృత్యం: శ్రీను
సహాయకురాలు: శకుంతల
స్టంట్స్: ఎఆర్ భాషా
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
సంగీతం: ఎస్‌పి కోదండపాణి
నిర్మాత: పి.మల్లికార్జునరావు
దర్శకత్వం: తాతినేని రామారావు
===========================================================

Pages