S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 04:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన అంబేద్కర్‌కు భరత జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుందని మోదీ అన్నారు. ‘బాబాసాహెబ్ అంబేద్కర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మహోన్నతమైన సేవలు అందించిన ఆయనకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

12/07/2016 - 04:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఇటు ప్రజలకే కాకుండా అటు దౌత్యపరంగా దేశానికి కూడా ఇబ్బందులు కలిగిస్తోంది. నగదు కొరతతో తమ రాయబార కార్యాలయ విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందని రష్యా నిరసన వ్యక్తం చేయడంతోపాటు అవసరమైతే ఈ విషయంలో ప్రతీకార చర్యకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

12/07/2016 - 04:47

హైదరాబాద్, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాతబస్తీలో పలు చోట్ల ముస్లింలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మంగళవారం బ్లాక్ డేను పురస్కరించుకుని పత్తర్ గట్టి, బార్కస్, గోల్కొండ, మదీనా, షంషీర్ గంజ్ ప్రాంతాల్లో పలువురు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సరిహద్దులో ప్రత్యేక బలగాలను మోహరింపజేశారు.

12/07/2016 - 04:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: సైనిక దుస్తులను, ఇతర సైనిక సామగ్రిని ఉపయోగించుకుని ఉగ్రవాదులు సైనిక స్థావరాలపై దాడులకు తెగబడుతున్నందున వాటిని ప్రైవేటుగా విక్రయించడం ‘చాలా తీవ్రమైన’ విషయమని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

12/07/2016 - 04:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్‌ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టిన నేపథ్యంలో నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించడానికి నెలరోజుల పాటు ప్రచారోద్యమాన్ని చేపట్టాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)దేశంలోని అన్ని యూనివర్శిటీలు, కాలేజిలను ఆదేశించింది.

12/07/2016 - 04:34

సంగారెడ్డి, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల దశదిశ మార్చే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముహూర్తం ఖరారు చేసారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 7.30 గంటలకు దివ్యమైన ముహూర్తంగా వేద పండితులు నిర్ణయించి 8.30 గంటలలోపు కార్యక్రమాన్ని పూర్తి చేయించాలని సూచించారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేసారు.

12/07/2016 - 04:31

హైదరాబాద్, డిసెంబర్ 6: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఏకకాలంలో రైతుల రుణ మాఫీ చేయాలని సంతకాల సేకరణ, విద్యార్థుల ఫీజుల రీయంబర్స్‌మెంట్ వంటి సమస్యలపై ఆందోళనలు చేపట్టినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

12/07/2016 - 04:28

హైదరాబాద్, డిసెంబర్ 6: క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీ జిల్లాకు వివిధ రంగాలపై సూక్ష్మస్థాయి పరిశీలనలతో క్షుణ్ణంగా అధ్యయనం చేసి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర కలెక్టర్లను ఆదేశించారు.కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారి ఈ నెల 14న నిర్వహించబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించే అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో ప్రదీప్ చంద్ర వీడియో కాన్ఫ

12/07/2016 - 04:28

హైదరాబాద్, డిసెంబర్ 6:బిసి సంక్షేమ హాస్టళ్లు, బిసి గురుకులాల్లో 49వేల మంది విద్యార్థులకు తక్షణమే రగ్గులు పంపిణీ చేయాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. బిసి సంక్షేమానికి నిధులు కొరత లేదని, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జోగు రామన్న విమర్శించారు. బిసిల కోసం ఎన్ని నిధులను కేటాయించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

12/07/2016 - 04:26

విజయవాడ, డిసెంబర్ 6: ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న ఏకీకృత సర్వీసు రూల్స్ అంశాన్ని ఢిల్లీలో వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేకాధికారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంఇఒ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు గంటా, పి.నారాయణ, రావెల కిషోర్ బాబు సమావేశమయ్యారు.

Pages