S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 05:13

మహబూబాబాద్, డిసెంబర్ 6: తెలంగాణలో కొత్తజిల్లాల ఏర్పాటు మురిపెం పట్టుమని నెలరోజులు కుడా నిలువలేదు. కొత్తజిల్లాల ఏర్పాటు సంతోషంతో ఒకవైపు ప్రజలు సంబురాల్లో ఉండగా కేంద్రప్రభుత్వం ఒక్కసారిగా పెద్దనోట్ల బ్యాన్‌తో పెద్ద బాంబు పేల్చింది. దీంతో ఒక్కసారిగా అటు రియల్ ఎస్టేట్ రంగంతోపాటు అన్నిరంగాలపై పెద్దనోట్ల బ్యాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

12/07/2016 - 05:12

మానకొండూర్, డిసెంబర్ 6: మానకొండూర్ కేంద్రంలోని కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారి అయిన చెరువు కట్ట సమిపంలో మంగళవారం తెల్లవారు జామున కొబ్బరి కాయాలతో వెల్లుతున్న లారీ ప్రమాదవశత్తు బోల్తా పడిన సంఘనటలో డ్రైవర్ తెనాలి అంనతరావు, క్లినర్‌క గాయాలు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్‌ఐ ఇంద్రసేన రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

12/07/2016 - 05:10

తొగుట, డిసెంబర్ 6: రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం పోలీసులు ప్రజలతో మమేకమై అహర్నిషలు కృషి చేస్తున్నారని ఐజి నాగిరెడ్డి అన్నారు. మంగళవారం తొగుట సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.

12/07/2016 - 05:08

నిజామాబాద్, డిసెంబర్ 6: నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ధర్మాబాద్ శివారులో పెద్దఎత్తున పేకాట జూదం కొనసాగుతోంది. ఆడిటోరియం వంటి భవనాన్ని అధునాతన హంగులతో అనధికార పేకాట క్లబ్‌గా తీర్చిదిద్దడంతో జూదరులతో కళకళలాడుతోంది.

12/07/2016 - 04:59

చెన్నై, డిసెంబర్ 6: ఓ పక్క బంగాళాఖాతం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. మరోపక్క జనసముద్రం కన్నీటి ధార ఆ బంగాళాఖాతానికి సమాంతరంగా ఆకాశమంత ఎత్తుకు ఎగిరిపడుతోంది. చెన్నై మహానగరానికి మంగళవారం యావత్ తమిళనాడు తరలివచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితను కడసారి చూసేందుకు బస్సులు, రైళ్లు, లారీలు ఏది దొరికితే అది అందిపుచ్చుకుని జనవాహిని పరుగులు పెట్టింది.

12/07/2016 - 04:53

కొత్తపేట, డిసెంబర్ 6: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వడయార్ తయారుచేస్తున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలోని ఎమ్‌జిఆర్ రీసెర్చ్ యూనివర్సిటీలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఎంజిఆర్ విగ్రహాలను తయారుచేసి తమిళనాడులో ఏర్పాటుచేసినట్టు చెప్పారు.

12/07/2016 - 04:52

హైదరాబాద్, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్, జయలలిత మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. జయలలిత మృతికి సంతాప సూచకంగా తెలంగాణ సచివాలయంపై అధికారులు జాతీయ జెండాను అవనతం చేశారు. అనంతరం రెండు నిముషాలపాటు వౌనం పాటించారు.

12/07/2016 - 04:51

హైదరాబాద్, డిసెంబర్ 6: ‘అన్నయ్యా’ అని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను అప్యాయంగా పిలిస్తే కడుపు, మనసు సంతోషంతో నిండిపోయేవని దర్శకరత్న దాసరి నారాయణ రావు గద్గద స్వరంతో అన్నారు. అలనాటి ప్రముఖ సినీ నటి, తమిళనాట రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకతను నిలుపుకున్న జయలలిత అస్తమించడం పట్ల సినీ నటులు, దర్శకులు దిగ్భ్రాంతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.

12/07/2016 - 04:50

హైదరాబాద్, డిసెంబర్ 6: నూతన విద్యా విధానం అమలులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మాదిరి ఇండియన్ ఎడ్యుకేషన్ సెంట్రల్ సర్వీసును ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన విధానాన్ని రూపొందించిన ప్రభుత్వం దానిపై నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయాలను సైతం స్వీకరించి, వాటిని క్రోడీకరించిన తర్వాత తదుపరి ప్రకటన చేయాలని చూస్తోంది.

12/07/2016 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ ప్రాంతంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో సమైక్య రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడ్డదని, ఈ అంశంపై విచారణ జరిపించాలని సుపరిపాలన వేదిక (్ఫరం ఫర్ గుడ్ గవర్నెన్స్) డిమాండ్ చేసింది.

Pages