S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 04:20

రాజమహేంద్రవరం, డిసెంబర్ 6 :పురావస్తు శాఖ పర్యాటక బోర్డులో విలీనమైంది. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ హడావిడిగా ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా పర్యాటకంతోపాటు సాంస్కృతిక, పురావస్తు శాఖలను టూరిజం బోర్డు పరిధిలోకి తీసుకు రావడం చరిత్రను అవమానించడమేనని చరిత్రకారులు ధ్వజమెత్తుతున్నారు.

12/07/2016 - 04:27

భద్రాచలం, డిసెంబర్ 6: పిఎల్‌జిఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలపై మందుపాతర్లతో విరుచుకుపడ్డారు. దంతెవాడ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా, నారాయణ్‌పూర్ జిల్లాలో మాత్రం పోలీసులు ఎదురుదాడి చేయడంతో అడవుల్లోకి పారిపోయారు.

12/07/2016 - 04:14

అనంతపురం, డిసెంబర్ 6: కర్ణాటక, ఆంధ్ర రైతుల జీవనాధారమైన తుంగభద్ర జలాశయం త్వరలో డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. మంగళవారం నాటికి జలాశయంలో కేవలం 9.6 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 7.5 టిఎంసిల దిగవకు చేరుకోనేగా డెడ్‌స్టోరేజిగా ప్రకటిస్తారు. జలాశయంలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో సీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది.

12/07/2016 - 04:12

విశాఖపట్నం, డిసెంబర్ 6: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన తూర్పు నౌకాదళం ఆధీనంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఇద్దరు యువకుల అనుమాన స్పద సంచారం ఉత్కంఠత రేకెత్తించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేవల్ డాక్‌యార్డ్‌లో నిషేధిత ప్రాంతంలోకి సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించినట్టు నేవీ అధికారులకు సమాచారం అందింది.

12/07/2016 - 04:11

విజయవాడ (క్రైం), డిసెంబర్ 6: విద్యుత్ చౌర్యంలో కడప, అనంతపురం జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి. గడిచిన ఏప్రిల్ నుంచి అక్టోబర్ మాసాంతానికి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 26వేల 500 కేసులు నమోదయ్యాయి.

12/07/2016 - 04:11

హైదరాబాద్, డిసెంబర్ 6: అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు ‘అర్చక గ్రీవెన్స్’ సమావేశాలు మూడు ప్రాంతాల్లో నిర్వహించాలని ఎపి దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్ వైవి అనూరాధ పేరుతో ఇటీవలే ఒక మెమో జారీ అయింది. ఈ నెల 15 న విజయవాడలో జరిగే సమావేశంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు.

12/07/2016 - 04:10

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోక్రీడలను మరింతగా అభివృద్ధి చేసేందుకు గాను ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయనున్నట్లు శాప్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగారరాజు తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది.

12/07/2016 - 04:09

విజయవాడ, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకాల మరణం తనకొక షాక్ లాంటిదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జయలలిత మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్ర సచివాలయం సంతాపం తెలిపింది. సంతాప సూచకంగా ఉద్యోగులు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు.. జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

12/07/2016 - 04:09

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగరంలో ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌ను స్థాపించేందుకు జపాన్ సంస్థ ఇంటర్నెట్ ఇన్ఫో వెటివ్ జపాన్ (ఐఐజె) సన్నాహాలు చేస్తోంది.

12/07/2016 - 04:08

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. రాజధానిలో వౌలిక సదుపాయాల కల్పనకు గాను హడ్కో సంస్థ తొలి విడతగా 1,275 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈసందర్భంగా మంగళవారం ఉదయం హడ్కో రుణ మంజూరు పత్రాన్ని అ సంస్థ ప్రాంతీయ ముఖ్య అధికారి ఎల్‌విఎస్ సుధాకర్ బాబు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్‌కు అందజేసారు.

Pages