S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 05:32

జగదాంబ, డిసెంబర్ 6: ఇటీవల నెల్లూరులో ముగిసిన రాష్ట్ర స్థాయి మహిళా రెజ్లింగ్ పోటీల్లో విజయం సాధించిన విశాఖ జిల్లా మహిళా రెజ్లర్‌లను మంగళవారం స్థానిక పాత నగరంలో గల రీడింగ్ రూమ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డాక్టర్ ఎమ్‌వివిఎస్ మూర్తి అభినందించారు.

12/07/2016 - 05:31

విశాఖపట్నం, డిసెంబర్ 6: బహిరంగ మల విసర్జన రహితం (ఓడిఎఫ్)గా తీర్చిదిద్దే క్రమంలో ఎక్కడైనా అతిక్రమణ జరిగితే కఠిన జరిమానాలకు వెనుకాడ వద్దని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్ల స్థాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన నియంత్రించేందుకు టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

12/07/2016 - 05:31

జగదాంబ, డిసెంబర్ 6: విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంతో సమానంగా భావ ప్రకటన నైపుణ్యాలను కలిగి ఉండాలని ఏయూ వీసి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏయూ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్లభాష నైపుణ్యాలు ఎంతో ప్రభావం చూపుతాయన్నారు.

12/07/2016 - 05:30

సింహాచలం, డిసెంబర్ 6 : శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి హుండీ ఆదాయం పెరిగింది. నాలుగు విడతలుగా తెరిచిన హుండీల (29 రోజులు) ద్వారా సుమారు ఒక కోటి 19 లక్షల రూపాయల ఆదాయం నగదు రూపంలో వచ్చింది. గత నెలలో కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం నేపథ్యంలో చిల్లర సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే.

12/07/2016 - 05:41

ఒంగోలు,డిసెంబర్ 6:ప్రపంచంలోనే గొప్పదైన భారతరాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ కొనియాడారు. మంగళవారం అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా నగరంలోని హెచ్‌సిఎం జూనియర్ కాలేజి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ సుజాతశర్మ, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్,జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

12/07/2016 - 05:26

భీమవరం, డిసెంబర్ 6: విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రగతిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నది కేవలం ఒఎన్జీసీ మాత్రమేనని కెజి బేసిన్ జనరల్ మేనేజర్ ఎవివిఎస్ కామరాజు (జియోలజీ,రాజమండ్రి) అన్నారు. భవిష్యత్తులో కూడా ఒఎన్జీసీ తెలుగు ప్రజల అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు. భీమవరంలో ఒఎన్జీసీ కేజి-పిజి బేసిన్‌లో షేల్‌గ్యాస్, ఆయిల్ అనే్వషణను ఒఎన్జీసీ ప్రతిపాదించింది.

12/07/2016 - 05:24

తడ (సూళ్లూరుపేట), డిసెంబర్ 6: తడ మండలం వేనాడు దర్గా గంధోత్సవ వేడుకలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఉరుసు నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి దర్గా లోపల ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు.

12/07/2016 - 05:22

కాకినాడ, డిసెంబర్ 6: జన్‌ధన్ ఖాతాల పూర్వాపరాల కూపీలాగే పనిలో ఆదాయ పన్ను (ఐటి) శాఖ అధికారులున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం బ్యాంకర్లవద్ద గల జన్‌ధన్ ఖాతాదారుల డేటాను సేకరించే పనిలో వారున్నట్టు తెలిసింది. దీంతో బినామీల్లో సునామీ సుడులు తిరుగుతోంది. గత నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్‌ధన్ ఖాతాల్లోకి బడా బాబుల సొమ్మొచ్చి పడినట్టు రూఢీ అయ్యింది.

12/07/2016 - 05:44

పూతలపట్టు, డిసెంబర్ 6: పలుప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పూతలపట్టు పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి 5.25 లక్షల విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

12/07/2016 - 05:17

ధర్మవరం రూరల్, డిసెంబర్ 6: పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడి కాలువ నుంచి విడుదలయ్యే నీటి పంపకాల వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారి అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతోంది.

Pages