S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 05:19

మన దేశంలో జనానికి సెంటిమెంట్లు ఎక్కువ. అందులోనూ ఆడవాళ్లకు అవి మరీ ఎక్కువ. ‘ఆడవాళ్లు గడపదాటి బయటకు రాకూడద’న్న అతి సాంప్రదాయ సంస్కృతిలో పుట్టిపెరిగిన స్ర్తిలు నాలుగు గోడల మధ్యే కాలం గడపడంతో అటువంటి భావజాలానికి అనాదిగా అలవాటుపడిపోయారు. ‘బొట్టు, కాటుక, పసుపు, కుంకాలు, పుస్తెల తాడు, నల్లపూసలు, మె ట్టెలు’వంటి మాటలు తప్ప..

12/08/2016 - 05:17

గణితం అన్ని సబ్జెక్టుల కన్నా ఉత్తమమైనటువంటి ప్రక్రియకు మూలం అంటారు. గణితం మనం ఏ విధంగా క్రమబద్ధంగా ఆలోచించాలో చెబుతుంది. ఈనాడు గణాతాన్ని సమస్యా పరిష్కారానికి వేదిక అంటున్నారు. గతంలో కన్నా ఇప్పటికి తేడా ఏమిటంటే? గతంలో గణితాన్ని ఎక్స్‌ర్‌సైజ్ కోసం ఉపయోగించారు. సమస్యను ఎలా పరిష్కరించాలో నియమితమై ఉంటుంది. ఆలోచనలో కలిసిన సమస్యా పరిష్కారం వల్లనే ఈనాడు సమస్యలకు విరుగుళ్లు దొరుకుతాయి.

12/08/2016 - 02:25

తెలుగులో మాట్లాడితే చెడ్డపేరు వచ్చేస్తుందన్న భయం దాదాపు అందరి ముఖాల మీద తాండవిస్తున్న అనుభూతి కలిగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఎగరబోతున్న ఆ ప్రభుత్వేతర రంగపు గగన శకటంలో ఒక రోజున దృశ్యమానమైన విచిత్రం ఇది. ఒక రోజున ఏమిటి? ప్రతిరోజూ ఇదే దృశ్యం మన దేశపు అన్ని విమానాలలోను, విమానాశ్రయాలలోను పునరావృత్తం అవుతుండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ ప్రభావం’!

12/08/2016 - 02:23

పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికపై అభిశంసించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. అమృతసర్‌లో ఆదివారం జరిగిన ‘అఫ్ఘానిస్థాన్ సంబంధ ఆసియా సదస్సు’- హార్ట్ ఆఫ్ ఆసియా- హెచ్‌ఓఏ- కాన్ఫరెన్స్-లో పాకిస్తానీ లష్కర్ ఏ తయ్యబా- ఎల్‌ఇటి-, జాయిష్ ఏ ముహమ్మద్- జెఇఎమ్-లను అభిశంసిస్తూ తీర్మానించడంతో ఈ విజయం ప్రస్ఫుటించింది.

12/07/2016 - 05:49

తిరుపతి, డిసెంబర్ 6: సాంకేతిక పునరుత్పత్తి విభాగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఆధునిక పరిజ్ఞానంతో కూడుకున్న విజ్ఞానాన్ని రైతులకు అందించాలని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విసి మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో పశుపునరుత్పత్తి విభాగంలో పశుపునరుత్పత్తి-సాంకేతిక పద్ధతులతో పునరుత్పత్తి పెంపొందించడం అనే అంశంపై మూడురోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది.

12/07/2016 - 05:49

తిరుపతి, డిసెంబర్ 6: కర్ణాటకలోని ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మతీర్థ స్వామివారు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారికి టిటిడి ఇఓ డి సాంబశివరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సత్యాత్మతీర్థ స్వామివారు మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో టిటిడి ముందు ఉందన్నారు.

12/07/2016 - 05:48

తిరుపతి, డిసెంబర్ 6 : నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ఎస్వీయూ విసి ఆచార్య దామోదరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలతో సమాజంలో అవినీతిని తగ్గించవచ్చని అన్నారు. ఇంటి వద్దే చరవాణిలో ఆర్థిక లావాదేవీలు జరిపి సమయాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు.

12/07/2016 - 05:46

తిరుపతి, డిసెంబర్ 6: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సర్వదర్శనం కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెండు ప్రాంతాల్లో స్థలాలను మంగళవారం టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన ప్లాన్‌ను ఇఓ పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు.

12/07/2016 - 05:45

తిరుపతి, డిసెంబర్ 6: ధనార్జన కన్నా నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, తద్వారా దేశాభివృద్ధి పురోగతి సాధిస్తుందని కెనరాబ్యాంక్ చైర్మన్, పద్మశ్రీ ఎన్ మనోహరన్ అన్నారు. ది సౌత్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఆర్‌సి) 48వ రీజనల్ కాన్ఫరెన్స్ మంగళవారం స్థానిక ఎస్వీవెటర్నీ క్రీడా మైదానంలో ప్రారంభమైంది.

12/07/2016 - 05:45

చిత్తూరు, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో జిల్లా తమిళుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జయలలిత ఆరోగ్యం కుదుటపడుతుందని భావిస్తున్న తరుణంలో ఆమె మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. మంగళవారం కూడా జిల్లా నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సులు దాదాపుగా నిలిచి పోయాయి. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల జయలలిత చిత్రపటాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

Pages