S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 05:43

ఒంగోలు, డిసెంబర్ 6 : రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దశల వారీగా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలులోని రవాణా శాఖ అధికారి కార్యాలయంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా వాహన యజమానులు ఫీజులు, టాక్సులు చెల్లించేందుకు స్వైపింగ్ మిషన్ల ను మంత్రి ప్రారంభించారు.

12/07/2016 - 05:43

ఒంగోలు,డిసెంబర్ 6:జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్‌చార్జులు ప్రజల్లోకి వెళ్ళాలని, ఆ విధంగా చేయకుండా షో చేస్తే మీకు నష్టం,పార్టీకి నష్టమని జిల్లాలోని పార్టీముఖ్యశ్రేణులకు హితబోధచేస్తూనే మరోకపక్క చురకలంటించారు.

12/07/2016 - 05:42

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 6: దేశ భవిష్యత్తు నేటి యువతపై ఆధారపడి ఉందని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ పేర్కొన్నారు. మంగళవారం వివిధ కాలేజిలకు చెందిన విద్యార్ధులు, ఎన్‌సిసి యూనిట్లు , కళాకారులతో నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటరులో నగదురహిత లావాదేవీలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ విద్యార్ధులు, యువతలో ఎవరికీ లేనంత ఎంతో వ్యత్యాసాలు ఉందన్నారు.

12/07/2016 - 05:42

త్రిపురాంతకం, డిసెంబర్ 6: దేశానికి వెనె్నముక అయిన రైతులను భూముల ఆన్‌లైన్ కోసం కార్యాలయాల చుట్టు తిప్పుకోవద్దని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆదేశించారు. మంగళవారం మార్కాపురం ఆర్డీఓ కె చంద్రశేఖరరావు అధ్యక్షతన తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు.

12/07/2016 - 05:41

కందుకూరు, డిసెంబర్ 6: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన చైతన్యయాత్రలను చేపట్టారని ఎమ్మెల్యే పోతుల రామారావు వెల్లడించారు. మంగళవారం మండల పరిధిలోని జి.మేకపాడు, కోవూరు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పోతుల, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధ్వర్యంలో జన చైతన్యయాత్రలు జరిగాయి.

12/07/2016 - 05:40

జయలలిత అకాలమరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె జీవితం పోరాటాలమయం. మేమిద్దరం జాతీయ స్థాయి రాజకీయాల్లో పనిచేశాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.
- చంద్రబాబు, ముఖ్యమంత్రి

12/07/2016 - 05:38

జయలలిత ప్రజల మనిషి. ఆమె రాజకీయ జీవితం సాహసోపేతం. తమిళనాడువంటి రాజకీయ చైతన్యం కలిగిన సమాజంలో సిఎంగా, పార్టీ అధ్యక్షురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది చరిత్ర సృష్టించారు.
-సిఎం కె చంద్రశేఖర్‌రావు

12/07/2016 - 05:34

విశాఖపట్నం, డిసెంబర్ 6: నిరుపేద వృద్ధులకు, భర్తలను పోగొట్టుకున్న వితంతువులకు, పని చేసుకోలేని దివ్యాంగులకు ప్రభుత్వం తరపున సామాజిక పింఛన్లు అందజేస్తోంది. వృద్ధాప్య, వితంతు పింఛన్లుగా రూ.1000, దివ్యా ంగులకు రూ.1,500 చొప్పున ప్రతి నెలా వారి చేతికందే మొత్తం ఇప్పుడు బ్యాంకుల్లో భద్రంగా ఉంది.

12/07/2016 - 05:33

విశాఖపట్నం, డిసెంబర్ 6: జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ఉద్యమ స్థాయిలో ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాం కర్లు, ఆంధ్రా విశ్వవిద్యాలయం అధ్యాపకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

12/07/2016 - 05:33

విశాఖపట్నం, డిసెంబర్ 6: స్వచ్ఛ విశాఖ లక్ష్యం నెరవేర్చడం కోసం ప్రజలు సహకరించాలని జీవిఎంసి కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. 35వ వార్డుకు చెందిని కైలాసపురం, శాంతినగర్, కస్తూరినగర్, మధుసూదన్‌నగర్, రాజీవ్‌నగర్, రాంజీఎస్టేట్స్, కప్పరాడల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 35వ వార్డులో పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించడంలేదన్నారు.

Pages