S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 01:42

ఆత్మకూరు, డిసెంబర్ 5: తన శాఖకు సంబంధించి వివిధ అంశాల్లో చోటుచేసుకుంటున్న జాప్యానికి నన్ను నేనే నిందించుకోవాలంటూ రాష్ట్ర వైద్యారోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ విచారకర ధోరణితో పేర్కొన్నారు. మున్సిపల్ మంత్రి నారాయణకే వైద్యారోగ్య వ్యవహారాల్లోనూ అనుభవం ఉన్నందున నా శాఖ సైతం ఆయన చేతుల్లోకి వెళ్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా సరదాగా చెప్పుకొచ్చారు.

12/06/2016 - 01:41

నెల్లూరుసిటీ, డిసెంబర్ 5: నగరపాలక సంస్థ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లును బదిలీ చేసి ఆయన స్థానంలో విజయవాడలోని భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న సబ్ కలెక్టర్ సాములూరు హరీష్‌ను బదిలీ చేశారు. అయితే హరీష్‌ను బదిలీ చేసి 4 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆయన్ని రిలీవ్ చేసేందుకు అధికారులు సుముఖత చూపలేదు.

12/06/2016 - 01:40

నెల్లూరు, డిసెంబర్ 5: పోలీస్ కానిస్టేబుల్ , జైల్‌వార్డర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 9 నుండి 14వ తేదీ వరకు దేహ ధారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని వెల్లడించారు.

12/06/2016 - 01:40

ఆత్మకూరు, డిసెంబర్ 5: నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 4.47 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. సోమవారం ఆత్మకూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కామినేనితో కలసి పొంగూరు పర్యటించారు.

12/06/2016 - 01:39

నెల్లూరు, డిసెంబర్ 5: తాగునీటి ఉత్పత్తిలో (ప్యాక్డ్ వాటర్) తాగునీటి ఉత్పత్తిదారులకు ఐఎస్‌ఐ, ఇతర శాఖల అనుమతులను సింగిల్‌విండో విధానం ద్వారా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సంబంధిత అధికారిని ఆదేశించారు. సోమవారం గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో తాగునీరు వాటర్ ప్లాంట్ యాజమాన్యాలతో, తహశీల్దార్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు.

12/06/2016 - 01:39

వెంకటాచలం, డిసెంబర్ 5: స్థల కేటాయింపులో వివాదం.. నిధుల విడుదలలో జాప్యం... నమూనాల ఏర్పాటుకు సందిగ్ధత వెరసి ఎన్నో బాలారిష్టాలను దాటిన జిల్లా సైన్స్ మ్యూజియం (జిల్లా వస్తు ప్రదర్శన శాల) ఎట్టకేలకు సోమవారం ప్రారంభమైంది. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట వద్ద జాతీయ రహదారిపై 1.25 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈ మ్యూజియంలో నమూనాలు తిలకించేందుకు సోమవారం విద్యార్థులను అనుమతించారు.

12/06/2016 - 01:38

నెల్లూరు రూరల్, డిసెంబర్ 5: కేవలం చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలని, నగదు రహితంగా ఎంత దూరమైన వెళ్లవచ్చునని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. సోమవారం ఒకటో డివిజన్ పరిధిలోని నారాయణరెడ్డిపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, అందరికి రూపేకార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

12/06/2016 - 01:37

విజయవాడ, డిసెంబర్ 5: విద్యార్థులను కేవలం చదువులు ఉత్తమ మా ర్కుల సాధన కోసం నాలుగు గోడలకే పరిమితం చేయకుండా సాంస్కృతిక, క్రీడా అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ప్రోత్సహించినప్పుడే వారి భవిష్యత్ రంగులయం ఆనందమయం కాగలదని జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గద్దె అ నూరాధ అన్నారు.

12/06/2016 - 01:34

మచిలీపట్నం, డిసెంబర్ 5: నగదు రహిత రేషన్ పంపిణీలో కృష్ణాజిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. టీమ్-కృష్ణా కృషి, పట్టుదలతోనే ఈ విజయాన్ని అందుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా నగదు రహిత సేవల్లో కృష్ణాజిల్లా రోల్ మోడల్ కావాలని, ఇందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.

12/06/2016 - 01:33

మచిలీపట్నం, డిసెంబర్ 5: పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 19వతేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించారు.

Pages