S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 01:26

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 5: ఎపి సిఆర్‌డిఎ కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై ఎలాంటి వేధింపులకు ఆస్కారం లేదని, మెరుగైన పని వసతులున్నాయని ఎపి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు.

12/06/2016 - 01:24

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 5: జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ అండర్-13 సింగిల్స్ బాలుర చాంపియన్‌షిప్‌ను తెలంగాణకు చెందిన జి ప్రణవ్‌రావు కైవసం చేసుకోగా, బాలికల విభాగంలో అనుపమ ఉపాధ్యాయ దక్కించుకుంది. ఫైనల్‌లో అతను శంకర్‌ముత్తుసామి (తమిళనాడు)పై 21-12, 21-16 తేడాతో విజయం సాధించాడు. బాలికల సింగిల్స్ ఫైనల్‌లో అనుపమ 21-19, 21-19 తేడాతో మేఘనరెడ్డి పై గెలుపొంది టైటిల్ సాధించింది.

12/06/2016 - 02:39

నాగపూర్, డిసెంబర్ 5: లోధా కమిటీ చేసిన సిఫార్సులను కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలో అన్ని క్రీడలకూ వర్తింప చేయాలని బహిష్కృత బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వానికి సూచించాడు. క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసిందని, వాటిని బిసిసిఐ ఎందుకు వ్యతికేరిస్తున్నదో తనకు అర్థం కావడం లేదని అతను విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

12/06/2016 - 01:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీం కోర్టులో కేసు ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించినప్పుడు తుది తీర్పునిచ్చే అవకాశం ఉందని, కనీసం బోర్డుకు మార్గదర్శకాలను విడుదల చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే, ఠాకూర్ అనారోగ్య కారణంగా కేసు తొమ్మిదో తేదీకి వాయిదా పడింది.

12/06/2016 - 01:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతిపక్షాలు సోమవారం వరుసగా 13వ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగకుండా అడ్డుకున్నాయి. ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలని లోక్‌సభలో డిమాండ్ చేసిన విపక్షాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలంటూ రాజ్యసభలోనూ గందరగోళం సృష్టించాయి.

12/06/2016 - 01:11

ముంబయి, డిసెంబర్ 5: ముంబయి నేవల్ డాక్‌యార్డ్‌లో మరమ్మతులకోసం వచ్చి లంగరు వేసి ఉన్న నౌకాదళానికి చెందిన యుద్ద నౌక ఐఎన్‌ఎస్ బెట్వా సోమవారం లంగరు తొలగిస్తున్న సమయంలో ఒక పక్కకు ఒరిగి పోవడంతో ఇద్దరు నేవీ జవాన్లు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.

12/06/2016 - 01:20

కరాచీ, డిసెంబర్ 5: పాకిస్తాన్‌లోని కరాచీలో సోమవారం తెల్లవారు జామున నాలుగు నక్షత్రాల హోటల్‌లో చెలరేగడంతో ఊపిరాడక దాదాపు 11 మంది మృతిచెందగా, మరో 75 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పాక్‌లో అతిపెద్ద నగరమైన కరాచీలో ఇటువంటి ఘటన జరగడం రెండు వారాల్లో ఇది నాలుగోసారి.

12/06/2016 - 01:06

కర్నూలు, డిసెంబర్ 5:కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో జిల్లాలో క్రమేణా నేతలు వౌనం దాలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక ఆరోపణ, ప్రత్యారోపణతో మీడియాలో దర్శనమివ్వాలని తపించే నేతలు ఇపుడు ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేసే నాయకులు ఇపుడు మీడియాకు దూరంగా ఉంటున్నారు.

12/06/2016 - 01:05

ఆదోనిటౌన్, డిసెంబర్ 5:కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్దనోట్లు స్థానంలో చిల్లర నోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిన ముఠాను చాకచౌక్యంగా అరెస్టు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

12/06/2016 - 01:04

నంద్యాల, డిసెంబర్ 5:్భమిని, భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు జీవరాశులను రక్షించుకుంటూ జీవవైవిధ్యాన్ని అనుసరిస్తూ రైతులు ముందుకు సాగాలని అప్పుడే భావితరాల వారికి మంచి భూమిని ఇవ్వగలమని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ పద్మరాజు అన్నారు.

Pages