S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 01:52

శామీర్‌పేట, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న కాస్తనగదును బ్యాంకులో వేసుకొని మార్చుకుందామంటే బ్యాంకుల ముందు భారీ క్యూలైన్‌తో ప్రజలు హడలెత్తుతున్నారు. ఉన్న కాస్తో, కూస్తో డబ్బులను ఎటిఎంల ద్వారా తీసుకుందామంటే అన్ని బ్యాంకుల ఎటిఎంలు క్యాష్ లేక, వచ్చిన క్యాష్ త్వరగా అయిపోడంతో ఏటిఎం సెంటర్లన్నీ వెలవెలబోతున్నాయి.

12/06/2016 - 01:51

హైదరాబాద్, డిసెంబర్ 5: మహానగరంలోని కోటి మంది జనాభాకు అత్యవసర సేవలందించే జిహెచ్‌ఎంసి కార్యకలాపాల్లో, అభివృద్ధిలో ప్రజల భాగాస్వామ్యాన్ని పెంచేందుకు ఇటీవలే వార్డు కమిటీలను నియమించారు. ఈ నియామకం ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య వార్‌గా మారింది.

12/06/2016 - 01:50

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రస్తుతం నగరంలోని బ్యాంకుల వారీగా జన్‌ధన్ యోజన ఖాతాలు ఎన్ని ఉన్నాయి? వాటిల్లో ఎంతమంది వాస్తవంగా ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారన్న వివరాలను తనకు సమర్పించాలని జిల్లా కలెక్టరే రాహుల్ బొజ్జా డిస్ట్రిక్ మేనేజర్‌ను ఆదేశించారు. అంతేగాక, జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలకెలాంటి సేవలందించాలనుకుంటున్నారు?

12/06/2016 - 01:50

నార్సింగి, డిసెంబర్ 5: ఎనిమిది రోజుల్లో ఫీజు బకాయిలు చెల్లించకుంటే లక్ష మంది విద్యార్థులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇల్లు ముట్టడిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజుల బకాయిలు రూ.2090కోట్లు చెల్లించాలని, మెస్ చార్జీలు పెంచాలని సోమవారం మధ్యాహ్నం మాసాబ్‌ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్‌ను పెద్దఎత్తున విద్యార్థులు ముట్టడించారు.

12/06/2016 - 01:49

తాండూరు, డిసెంబర్ 5: ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పనులలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మిషన్ భగీరథ పనులను అధికారులు, కాంట్రాక్టర్లు త్వరితగతిన చిత్తశుద్ధితో పూర్తి చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంత్రి తాండూరు డివిజన్‌లోని బషిరాబాద్ మండలంలో పర్యటించారు.

12/06/2016 - 01:49

మేడ్చల్, డిసెంబర్ 5: భారత దేశంలో అధిక మొత్తంలో యువత ఉందని.. నేడు ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని.. ఏదేని సాధించగలిగే సత్తా శక్తి మన దేశ యువతకే ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటిశాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. జిల్లాలోని మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలోని ధృవ మేనేజ్‌మెంట్ కళాశాలలో సోమవారం మంత్రి కెటిఆర్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

12/06/2016 - 01:48

ఉప్పల్, డిసెంబర్ 5: సబ్సిడీ రుణం కింద వాహనాలను ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల వద్ద లక్షలు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఓ షోరూం టీం లీడర్ విధులకు హాజరు కాకుండా కన్పించకుండా పోవడంతో బాధితులు న్యాయం కోసం ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే..

12/06/2016 - 01:47

చేవెళ్ల, డిసెంబర్ 5: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అభయం శుభం తెలియని ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, గొంతు కోసి కిరాతకంగా హతమార్చిన సంఘటన మొయినాబాద్ మండలం చిల్కార్‌లో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చిలుకూర్ గ్రామానికి చెందిన కాడిగల్ల మహేందర్ కుమారుడు రోహన్‌కుమార్ అలియాస్ చక్రి (9),ఓ ప్రైవేట్ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు.

12/06/2016 - 01:47

సికిందరాబాద్, డిసెంబర్ 5: రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని నగర టిడిపి కోకన్వీనర్ మేకల సారంగపాణి పేర్కొన్నారు. సోమవారం సికిందరాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. టిడిపి సభ్యత్వం పట్ల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. లష్కర్ టిడిపికి కంచుకోటగా నిలుస్తూ వస్తుందని పేర్కొన్నారు.

12/06/2016 - 01:42

నెల్లూరు, డిసెంబర్ 5: పాత నోట్ల రద్దు జరిగి ఓ మాసం పూర్తవుతోంది. సామాన్యుల సమస్య ఇప్పటికి సశేషంగానే ఉంది తప్ప సమాప్తం కానంటోంది. కరెన్సీ కష్టాలు ఓ వైపు, చచ్చి చెడి తెచ్చుకున్న పెద్ద నోటుకు చిల్లర దొరకక మరో వైపు ప్రజల కష్టాలకు పరిమితం ఉండటం లేదు. శనివారం జిల్లాకు రూ.167 కోట్ల మేర నగదు రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది.

Pages